ETV Bharat / international

క్వారంటైన్‌ 'రాణి'గా పేరు పొందిన జర్నలిస్ట్​!

author img

By

Published : May 18, 2020, 8:46 AM IST

15 రోజులు క్వారంటైన్​లో ఉండాలంటేనే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఓ మహిళ రెండు ఖండాల్లో 3 నెలల వ్యవధిలో నాలుగు సార్లు నిర్బంధంలో గడపి బయటకు వచ్చింది ఆమె. ఇప్పుడు తనను సన్నిహితులంతా 'క్వారంటైన్ రాణి' అని పిలుచుకుంటున్నారు. ఆమే అమెరికన్​ జర్నలిస్టు అమిక్విన్.

American journalist Amquin
క్వారంటైన్‌ రాణి అమిక్విన్

క్వారంటైనా.. 15 రోజులు ఒంటరిగా ఉండాలా? అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో? ఇది పలువురి ఆవేదన. కానీ ఈమె కథ వింటే ఆ ఆవేదన కొంత తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా నాలుగుసార్లు క్వారంటైన్‌లో ఉన్నారు మరి! అదీ మూడు నెలల్లో.. రెండు ఖండాల్లో. దీనితో ఆమెను ఆమె స్నేహితులు సరదాగా క్వారంటైన్‌ రాణి అని పిలుస్తున్నారట. ఇదీ అమెరికా జర్నలిస్ట్‌ అమిక్విన్‌ నిజ జీవిత కథ.

బాబోయ్​ క్వారంటైన్​

'ఓ వార్తా సంస్థలో చైనా ప్రతినిధిగా బీజింగ్‌లో పనిచేస్తున్నా. జనవరిలో కరోనా వార్తల సేకరణకు వుహాన్‌ వెళ్లా. తర్వాత కొద్దిరోజులకే చైనా ప్రభుత్వం వుహాన్‌లో ఉన్న విదేశీయులను వెనక్కి పంపించడం ప్రారంభించింది. అలా నేను కూడా చైనా విమానంలో శాన్‌డిగో(అమెరికా)లోని మిర్మార్‌ నావికాదళం వాయు స్థావరంలో దిగా. అప్పటికి అమెరికాలో కరోనా కేసులు 12 మాత్రమే. నన్ను అక్కడే క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్‌ ముగిశాక కేరింతలు కొడుతూ ఇంటికి వెళ్లా. క్రమంగా చైనాలో కరోనా కేసులు తగ్గుతుండడంతో.. ఫిబ్రవరి చివరిలో మళ్లీ బీజింగ్‌కు ప్రయాణమయ్యా. ప్రయాణంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రెండు గంటల విరామం ఉంది. అప్పటికే దక్షిణ కొరియాలో వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంది. నేను దక్షిణ కొరియాలో రెండుగంటల సేపు ఉన్నందుకు.. చైనాలో దిగగానే కార్వంటైన్‌లో ఉండాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అక్కడ ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నా.

కరోనాతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మార్చి మొదటి వారంలో.. చైనా ప్రభుత్వం అమెరికా జర్నలిస్టుల్ని వెనక్కి పంపాలని నిర్ణయించింది. అందులో నేను కూడా ఉన్నా. అలా మళ్లీ అమెరికాకు ప్రయాణమై లాస్‌ఎంజెలెస్‌ విమానాశ్రయంలో దిగా. విమానాశ్రయం అంత ఖాళీగా ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటికి అమెరికాలో కేసుల సంఖ్య 2.4 లక్షలకు చేరింది. ఈ క్రమంలో మళ్లీ కార్వంటైన్‌ తప్పలేదు. వుహాన్‌లోని అనుభవాలతో గది నుంచి బయటికి రాలేదు.

తర్వాత ఏప్రిల్‌లో నన్ను తైవాన్‌ నుంచి చైనా వార్తలు రాయాలని రాజధాని తైపికి పంపారు. ఆ దేశం కరోనాని అంతబాగా ఎలా కట్టడి చేసిందనే విషయం.. అక్కడి వారి జాగ్రత్తలు చూశాక అర్థమైంది. అక్కడి హోటల్‌ సిబ్బంది అంతా రక్షణ దుస్తులు, మాస్క్‌లు, కళ్లజోళ్లు ధరించి ఉన్నారు. నేను వెళ్లగానే నా వస్తువుల్ని క్రిమిరహితం చేశారు. రూమ్‌కి వెళ్లాక.. మళ్లీ రెండు వారాల వరకూ నేను ఒక్క మనిషినీ చూడలేదు. ప్రతి రోజూ నా శరీర ఉష్ణోగ్రతని హోటల్‌ వారికి, తైవాన్‌ ప్రభుత్వానికి పంపించేదాన్ని. హోటల్‌ బాయ్‌ రోజూ మూడు సార్లు ప్యాక్‌ చేసిన భోజనాన్ని తెచ్చి తలుపునకు ఉన్న హుక్‌కి పెట్టి వెళ్లేవాడు. ఇదంతా చాలా చక్కగా చేసేవాళ్లు. అంతాబాగానే ఉన్నా.. చివరిలో చాలా విసుగొచ్చింది. బయటికి వచ్చి సూర్యుడి వెలుగు చూడాలని తపించా. ఎట్టకేలకు రెండు వారాలకు క్వారంటైన్‌ నుంచి బయటపడ్డా' అని వివరించారు అమిక్విన్‌.

ఇదీ చూడండి: పెద్దలను బతికించుకునేందుకు అడవిబిడ్డల పోరాటం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.