ETV Bharat / international

ట్విట్టర్​, ఫేస్​బుక్ ట్రంప్​ను బ్యాన్​ చేస్తాయా? - ట్రంప్​ సామాజిక మాధ్యమాలు

వివాదాలకు మారు పేరు..​ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. సంచలన పోస్టులు, ట్వీట్లతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతుంటారాయన. విద్వేషపూరిత ట్వీట్లతో చాలాసార్లు నిబంధనలు అతిక్రమించిన ఘనత ఆయనది. కానీ, అగ్రరాజ్యం అధ్యక్షుడి స్థాయిలో ఇన్నాళ్లూ 'ప్రత్యేక హోదా' అనుభవించారు. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్​బుక్​లో తప్పుడు సమాచారాన్ని షేర్​ చేసినా.. విమర్శకులపై దూషణలకు దిగినా సదరు సంస్థలు మిన్నకుండిపోయాయి. మరి భవిష్యత్తులో ఎలా స్పందిస్తాయి ? జనవరిలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక... ట్రంప్​పై సామాజిక మాధ్యమాలు నిషేధం విధిస్తాయా?

Twitter, Facebook crack down on Trump
ట్రంప్​ పదవీచ్యుతుడయ్యాక.. సామాజిక మాధ్యమాలు విరుచుకుపడతాయా?
author img

By

Published : Nov 26, 2020, 1:49 PM IST

విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాలు కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అయితే, ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విషయంలో సంయమనం పాటించాయి. అధ్యక్ష హోదాలో ఉన్న ఆయన్ను చాలాసార్లు మౌనంగానే భరించాయి ట్విట్టర్​, ఫేస్​బుక్​ వంటి సంస్థలు. అవే వ్యాఖ్యలు సాధారణ పౌరులు చేసుంటే.. ఖాతాలు తొలగించేవి. కానీ, ట్రంప్​ ఖాతాలకు 'వార్నింగ్​ లేబుల్​'తోనే సరిపెట్టాయి.

జనవరి 20 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా ట్రంప్ పదవీకాలం ముగిశాక.. బైడెన్​ అధ్యక్ష పీఠం అధిరోహించాక.. భారీగా ఫాలోవర్లు ఉన్న హై-ప్రొఫైల్​ ట్రంప్​ ఖాతాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల సంస్థలు ఎలా వ్యవహరించనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ట్రంప్​ ట్వీట్లకు ఎందుకన్ని లేబుల్​లు ?

అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు వెలువడుతున్నపుడు మొదటి నుంచి.. ట్రంప్​ ఓటమివైపుగా పయనించారు. అయితే, తనదే గెలుపంటూ ఒకసారి, ఎన్నికలు అక్రమమంటూ మరోసారి, బైడెన్​ను గెలిపించేందుకు అందరూ కలిసి కుట్ర చేశారంటూ ఇంకోసారి.. నిరాధార ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారం ఇస్తోన్న ట్రంప్​ పోస్టులకు.. ట్యాగ్​లు జతచేశాయి సోషల్​ మీడియా సంస్థలు.

అయితే.. ట్రంప్​ ట్వీట్లకు మాత్రమే కాదు.. 'సివిక్​ ఇంటిగ్రిటీ' విధానం కింద చాలామంది ట్వీట్లకు లేబుల్​ చేర్చారు. తప్పుడు సమాచారం ఇస్తోన్న పోస్ట్​లపై కఠినంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో అసత్య వార్తలను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్​ జరగేందుకు ఈ విధంగా వ్యవహరించారు.

ఎన్నికల రోజు నుంచి దాదాపు 100కు పైగా ట్రంప్​ ట్వీట్లకు, రీట్వీట్లకు... 'సరికాదు', 'అధికార సమాచారం వేరు' అంటూ లేబుళ్లు అంటించింది ట్విట్టర్​. కింద వచ్చిన లింక్​ను క్లిక్​ చేస్తే.. అధికార సమాచారం పొందే విధంగా ఏర్పాట్లు చేసింది. అంతకుముందెన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవు. ఫేస్​బుక్​ సైతం ఇలానే వ్యవహరించింది.

చెరో దారిలో ఫేస్​బుక్​, ట్విట్టర్​?

ఎన్నికలపై ట్రంప్​ వ్యాఖ్యలకు తప్పంటూ ముద్ర వేసేందుకు ఇరు సంస్థలు ఒకానొక దశలో పోటీపడ్డాయి. అయితే, ఈ వ్యాఖ్యలు విస్తృతం కాకుండా చూసేందుకు ట్విట్టర్​ కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంది.

ఫేస్​బుక్​ కాస్త ముందుగానే బైడెన్​ విజేత అంటూ యూజర్లకు వెల్లడించగా.. ట్విట్టర్​ కాస్త ఆచితూచి అడుగులేసింది. అయితే, ఈ లేబుల్​ జతచేసిన వ్యాఖ్యలను షేర్​, రీట్వీట్​ చేసేందుకు సదరు సంస్థలు చిన్న హెచ్చరికతోనే అనుమతించాయి.

Twitter, Facebook
ట్విట్టర్-ఫేస్​బుక్
లేబుళ్ల ప్రభావమెంత ?

సామాజిక మాధ్యమాలు 2016 ఎన్నికలతో పోలిస్తే.. 2020 ఎన్నికల్లో సమర్థంగా పనిచేసినట్లు కొన్ని నివేదికలు తేల్చాయి. ముఖ్యంగా అమెరికా ఎన్నికల సమగ్రత కాపాడేలా వ్యవహరించాయంటున్నారు పరిశీలకులు. అయితే, అసత్య వార్తలను పరిమితం చేసేలా.. లేబుళ్లకు తోడు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్రంప్​ సహా మరికొంతమంది తప్పుడు సమాచారం వెల్లడిస్తున్నప్పుడు లేబుళ్లు వేసినంత మాత్రాన పెద్ద ప్రయోజనం లేదని.. ఇవి ఎటువంటి వ్యాఖ్యలను అడ్డుకోలేవని అంటున్నారు. అయితే, రెండు సామాజిక మాధ్యమాల దిగ్గజాలు.. ఎన్నికల్లో ఓటింగ్​ పెంచేందుకు తమవంతు ప్రయత్నం చేశాయని గుర్తు చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాలు సరైన దిశలోనే పయనిస్తున్నాయి. అయితే, భారీగా ప్రభావం చూపించలేకపోయాయి. ట్విట్టర్​ 15 నిమిషాల తర్వాత లేబుల్​ జారీ చేస్తే.. ఫేస్​బుక్​ కాస్త తక్కువ సమయం తీసుకుంది. అయితే, అప్పటికే ఈ తరహా వార్తలు అంతర్జాలమంతా విస్తరించిపోతున్నాయి. అందుకే మరింత ప్రభావవంతమైన మార్గం అన్వేషించాలి.

-జెన్నిఫర్​ గ్రైగేల్, ప్రొఫెసర్​, సిరక్యూస్ విశ్వవిద్యాలయం

  • బైడెన్​ గద్దెనెక్కిన తర్వాత ఏం జరుగుతుంది ?

అన్నింటికన్నా ముందు ట్రంప్​ పౌరుడిగా మారతారు. సామాజిక మాధ్యమాల్లో మాజీ అధ్యక్షుడిగా, సాధారణ యూజర్​గా ఉంటారు. ట్విట్టర్​ నిబంధనల్లో భాగంగా ఉన్న 'ప్రపంచ నేతల' జాబితాలోంచి బయటకు వచ్చేస్తారు. ఇక ట్విట్టర్​ నియమాలకు అనుగుణంగా ట్రంప్​ ట్వీట్లు ఉండాల్సిందే.

ఫేస్​బుక్​లో.. ట్రంప్​ పోస్ట్​లను థర్డ్​ పార్టీ ఉద్యోగులు నిజానిజాలను తనిఖీ చేయనున్నారు. ఇప్పటికే ఫేస్​బుక్​, ట్విట్టర్​ సంస్థలు అధికార ఖాతాలన్నింటినీ.. బైడెన్​ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయనకు బదిలీ చేసేందుకు సిద్ధమయ్యాయి.

ట్రంప్​ను బహిష్కరిస్తారా ?

ట్రంప్​ సాధారణ పౌరుడిగా మారితే.. ఆయన ఖాతాలు తొలగించటం సులభమే. అయితే, అలాంటి చర్యలు తీసుకోకపోవచ్చు. ఇప్పటివరకు సంస్థలు జారీ చేసిన లేబుళ్లు ఆయన ఖాతా తొలిగించేందుకు సరిపోవు. ఆయన ట్విట్టర్, ఫేస్​బుక్​ నియమాలు ఉల్లంఘించారని రుజువు చేయాలి. జాత్యాహంకార వ్యాఖ్యలు, ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలపై వ్యాఖ్యలు చేసినప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటివరకు ట్రంప్​ అలా చేసిన దాఖలాలు లేవు.

ఇదీ చూడండి: ట్రంప్- ట్విట్టర్​ వార్​లో గెలిచింది ఎవరు?

ఇదీ చూడండి: 'ట్రంప్ వద్దన్నా బైడెన్​కే ఆ ఖాతాను అప్పగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.