కొలంబియా రాజధాని బొగోటాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి... పౌరులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతి చెందారు.
పోలీసుల అమానుష ప్రవర్తన కారణంగా 43 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఆయన మృతికి సంఘీభావంగా నిరసనలు చెలరేగాయి.
పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయిన పౌరులు... 8 సిటీ బస్సులను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. స్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 175 మంది పౌరులు గాయపడ్డారు. నిరసనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువత కావడం గమనార్హం. నిరసకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు, రబ్బరు బల్లెట్లు ఉపయోగించారు పోలీసులు.
ఇదీ చూడండి: 'ఉగ్రమూకలపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి'