ETV Bharat / international

'ట్రంప్ కష్టానికి ఫలితమే‌ 'నోబెల్'​ నామినేషన్​' - white house response on trump Nobel Peace Prize nomination

ప్రతిష్ఠాత్మక నోబెల్​ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పేరును ప్రతిపాదించడంపై.. శ్వేతసౌధం​ స్పందించింది. ఈ అవార్డుకు ట్రంప్​ అర్హమైన వ్యక్తిగా పేర్కొంది. ఆయన విధానాలే ఈ అవార్డుకు అర్హత సంపాదించిపెట్టాయని తెలిపింది.

President Trump's Nobel Peace Prize nomination hard-earned and well-deserved: WH
'ట్రంప్ కష్టానికి ఫలితమే‌ నోబెల్​ బహుమతి నామినేషన్​'
author img

By

Published : Sep 10, 2020, 7:52 PM IST

నోబెల్‌ శాంతి బహుమతి-2021కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయెల్‌, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు.. నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే.. ట్రంప్​ పేరును నామినేట్‌ చేశారు. తాజాగా ఈ విషయంపై శ్వేతసౌధం స్పందించింది. ఇజ్రాయెల్‌, యూఏఈ మధ్య సామరస్యం నెలకొల్పేందుకు ట్రంప్​ చాలా కృషి చేశారని.. అందుకు దక్కిన ఓ గొప్ప గౌరవమని పేర్కొంది. శాంతి నెలకొల్పడం సహా తన విదేశీ విధానాల వల్ల ట్రంప్​ ఈ అర్హత సంపాదించుకున్నారని ప్రశంసలు కురిపించింది వైట్​హౌస్​.

"అధ్యక్షుడు ట్రంప్​ నోబెల్​ శాంతి బహుమతికి నామినేట్​ అవడం ఆయన పనికి ఓ గుర్తింపు. ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య శాంతి ఒప్పందానికి కారణం ఆయనే. ఇది 20 ఏళ్లలోనే చారిత్రాత్మక ఒప్పందం. అందుకే ఇది చాలా కష్టపడి సంపాదించుకున్నది. ట్రంప్​ ఈ అవార్డుకు అర్హులు. తన విదేశీ విధానాల్లోనూ శాంతిని ప్రధానంగా భావిస్తున్నారు."

--కైలీ మెక్ననీ, వైట్​హైస్​ ప్రెస్​ సెక్రటరీ

ఆ ఒప్పందంతో..

ట్రంప్​ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్‌​, యూఏఈ మధ్య దౌత్యసంబంధాలు కొత్త ఊపిరి పోసుకున్నాయి. ఆగస్టు 31న మొదటి వాణిజ్య విమానం ఇజ్రాయెల్ నుంచి అబుదాబిలో అడుగుపెట్టింది. జోర్డాన్​, ఈజిప్ట్ తర్వాత​ ఇజ్రాయెల్​తో సత్సంబంధాలు కుదుర్చుకున్న మూడో అరబ్​ దేశంగా యూఏఈ నిలిచింది.

భారత్​ మాత్రం తిరస్కరణ..

ట్రంప్​ ఇప్పటికే పలు దైపాక్షిక అంశాల్లో మధ్యవర్తిత్వం వహించారు. అలాగే కశ్మీర్​ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు. అందుకు భారత్​ నిరాకరించింది. కశ్మీర్​ తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. తాజాగా.. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తరహా ప్రతిపాదన చేశారు ట్రంప్​. ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది భారత్​.

రెండోసారి..

ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలను ట్రంప్‌ పరిష్కరించారంటూ ప్రశంసించారు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే. పశ్చిమాసియా నుంచి భారీ సంఖ్యలో అమెరికా దళాలను ట్రంప్‌ ఉపసంహరించుకొనేలా చేశారన్నారు.

ట్రంప్‌నకు నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ట్రైబిడ్రే మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు. 2018లోనూ ట్రంప్​ పేరును నామినేట్‌ చేశారు. అయితే, నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ శాంతి బహుమతి పొందారు. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి, ప్రజల మధ్య సహకారానికి ఒబామా చేసిన అసాధారణ కృషికి గాను.. ఆయనకు నోబెల్​ పురస్కారం దక్కింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.