ETV Bharat / international

హెచ్​-1బీ వీసాలపై శ్వేతసౌధం కీలక ప్రకటన

author img

By

Published : Feb 12, 2021, 8:11 AM IST

హెచ్​-1బీ వీసాల జారీపై కీలక ప్రకటన చేసింది అమెరికా. ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో సరళమైన విధానాల పునరుద్ధరణపై అధ్యక్షుడు జో బైడెన్​ చాలా స్పష్టంగా ఉన్నారని తెలిపింది. విభజనపూరితంగా, అమానవీయంగా తీసుకున్న విధానాలను మార్చటంపైనే దృష్టిసారించినట్లు వెల్లడించింది.

H1B visas
హెచ్​-1బీ వీసా

అమెరికా ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో సరళమైన విధానాల పునరుద్ధరణపై అధ్యక్షుడు జో బైడెన్​ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారని వెల్లడించింది శ్వేతసౌధం. కొద్ది వారాలుగా వరుసగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు జో బైడెన్​ సంతకాలు చేయటం ఆరంభం మాత్రమేనని పేర్కొంది. గత నాలుగు సంవత్సరాల్లో విభజనపూరితంగా, అమానవీయంగా తీసుకున్న అనైతిక విధానాలను సరిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపింది.

గ్రీన్​కార్డులు, శాశ్వత నివాసాల అనుమతులపై వివక్షత, ఏకపక్షంగా ఉన్న పరిమితిని తొలగించే వరకు భారత్​లోని ఏ ఒక్కరికి హెచ్​-1బీ వీసాలు జారీ చేయొద్దని భారతీయ-అమెరికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమ్మిగ్రేషన్​ సలహా బృందం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై ప్రశ్నించగా సమాధానమిచ్చారు శ్వేతసౌధం ప్రతినిధి.

అయితే.. అలాంటి ఆదేశాలు ఇచ్చే ఆలోచన ఉందా? అనే అంశంపై శ్వేతసౌధం స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో, మానవత దృక్పథంతో సమగ్రమైన ఇమ్మిగ్రేషన్​ సంస్కరణలకు కట్టుబడి ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈటీవల కాంగ్రెస్​కు పంపిన ఇమ్మిగ్రేషన్​ సంస్కరణ బిల్లులో.. ఇమ్మిగ్రేషన్​ వాయిస్​, భారత ఐటీ నిపుణుల సంస్థల ప్రధాన డిమాండైన గ్రీన్​కార్డుల జారీలో దేశీయ కోటాను తొలగించటంపై ప్రతిపాదనలు చేసింది.

వివక్షత, ఏకపక్షంగా ఉన్న పరిమితి వల్ల లక్షల మంది గ్రీన్​కార్డులు పొందేందుకు వేచిచూడాల్సి వస్తుందని, సుమారు సగటున 195 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు ఇమ్మిగ్రేషన్​ వాయిస్​ సంస్థ అధ్యక్షుడు అమన్​ కపూర్​. అది 2030 నాటికి దరఖాస్తు చేసుకునే వారికి గ్రీన్​కార్డు అందాలంటే 436 ఏళ్లు పడుతుందన్నారు. ఐఎన్​ఏ సెక్షన్​ 212(ఎఫ్​)ను వినియోగించి చర్యలు తీసుకోవాలని బైడెన్​ పరిపాలన విభాగాన్ని కోరారు.

ఇదీ చూడండి: 'భారతీయులకు హెచ్​1-బీ వీసాలు నిలిపివేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.