అమెరికా అధ్యక్ష ఫలితాలను అంగీకరించేందుకు బెట్టు చేసిన డొనాల్డ్ ట్రంప్ దిగొస్తున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు కచ్చితమైనవే అయితే వాటిని స్వీకరించేందుకు సిద్ధమేనని తాజాగా ప్రకటించారు. బుధవారం తన మద్దతుదారులతో కలిసి శ్వేతసౌధంలో హాలిడే పార్టీ నిర్వహించిన ట్రంప్.. సవ్యంగా జరిగిన ఓటింగ్లో ఓడిపోయినా తాను పట్టించుకోనని అన్నారు.
"ఎన్నికల్లో ఓడిపోయే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కానీ సవ్యంగా జరిగిన ఎన్నికల్లోనే ఓడిపోవాలని కోరుకుంటున్నాను. అమెరికా ప్రజల నుంచి 'దొంగలించిన ఓటింగ్'లో ఓడిపోవాలని అనుకోవడం లేదు. అందుకోసమే మేం దీనిపై పోరాడుతున్నాం. మాకు ఇంకో అవకాశం లేదు.
సవ్యంగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఆమోదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జో బైడెన్ కూడా ఇదే చేస్తారని అనుకుంటున్నా."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మరోవైపు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను కొనసాగించారు ట్రంప్. అర్హులైన ఓటర్ల బ్యాలెట్లు మాత్రమే లెక్కించాలని అన్నారు. గడువులోగా న్యాయబద్ధంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను ధ్రువీకరించే పారదర్శక, నమ్మకమైన వ్యవస్థ లేకుండా అమెరికాకు మరో ఎన్నిక జరగకూడదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
'ఫలితాలు మార్చేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు'
అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం.. కానీ!