గర్భిణీలపైనా కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాలని లాన్సెట్ పరిశోధన తేల్చింది. దాని వల్ల వారికి మెరుగైన వైద్యసేవలను అందించవచ్చని అభిప్రాయపడింది.
కొవిడ్ చికిత్సకు వాడే రెమిడెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, కార్టికో స్టెరాయిడ్స్ తదితర మందులను గర్భిణీలకు ఇవ్వడం లేదు. అయితే కరోనా వాక్సిన్ ట్రయల్స్ నుంచి దూరంగా గర్భణీలను దూరంగా ఉంచడం సరికాదని తెలిపింది. దాని వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వారిని భాగస్వాములను చేయడమే మంచిదని స్పష్టం చేసింది.
8 వేలమందిపై..
అమెరికాలో కరోనా సోకిన 8,207 మంది గర్భిణీలపై లాన్సెట్ ఈ సర్వే చేసింది. అందులో.. చాలా మందికి అత్యవసరవైద్యం కావాలని తేలింది. ఫలితంగా.. గర్భిణీలపైనా కరోనా ట్రయల్స్ చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని అభిప్రాయపడింది.
గర్భిణీలపై క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేయట్లేదో కారణాలు తెలవలేదని పేర్కొంది. బహుశా పిండానికేమన్నా ఇబ్బంది తలెత్తుందేమోనని భయపడి ఉండొచ్చని అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: 'కొవిడ్‌తో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం ఇదే మొదటిసారి'