ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేసే దిశగా పావులు కదుపుతోంది అగ్రరాజ్యం అమెరికా. చమురు నౌకలపై దాడి ఇరాన్ పనేనని ఆరోపిస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. హొర్ముజ్ జలసంధి చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మక మార్గమని, ఆసియా దేశాలకు కీలకమని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలు ఏకం కావాలి
చమురు నౌకలపై దాడి ఘటనపై ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఆకాంక్షించారు పాంపియో. కానీ ట్రంప్ సర్కారు ఇరాన్‌కు వ్యతిరేకంగా తీసుకునే చర్యలను వెల్లడించేందుకు ఆయన వెల్లడించలేదు. తమతో కలిసి వచ్చే దేశాలతో కలసి ఈ అంశమై పనిచేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు దేశాలతో ఈ విషయమై చర్చించినట్లు పాంపియో తెలిపారు.
దాడి ఆరోపణలను తోసిపుచ్చిన ఇరాన్
చమురు నౌకలపై దాడి అంశాన్ని ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశంపై అమెరికా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
ఇదీ చూడండి: 'పుల్వామా 2.0'పై భారత్‌కు పాక్ హెచ్చరిక