ETV Bharat / international

'వైరస్​ గురించి చైనాకు నవంబరులోనే తెలుసు'

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి చైనాకు గతేడాది నవంబరులోనే తెలిసి ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో వ్యాఖ్యానించారు. అయితే బీజింగ్​ పారదర్శంగా వ్యవహరించలేదని ఆరోపించారు.

author img

By

Published : Apr 24, 2020, 11:18 AM IST

Updated : Apr 24, 2020, 11:25 AM IST

Pompeo says China may have known of virus in November
'వైరస్​ గురించి చైనాకు గతేడాది నవంబరులోనే తెలుసు'

కరోనా గురించి చైనాకు గతేడాది నవంబరు నాటికే తెలిసి ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో వ్యాఖ్యానించారు. అయితే వైరస్​ విషయంలో బీజింగ్​ పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపించారు.

"వైరస్​ను త్వరగా గుర్తించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ విఫలమయ్యారు. ఇప్పటికే అమెరికా ప్రజలపై వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్​ నుంచి సార్స్​-కొవిడ్-2 నమూనాతో సహా చైనా నుంచి మరింత సమాచారాన్ని అమెరికా కోరుకుంటోంది. ఈ సమాచారం గతేడాది చివర్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికే కాదు... ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది."

-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి​

సమాచారాన్ని దాచి పెట్టింది!

కరోనా సమాచారాన్ని రహస్యంగా తన దగ్గర ఉంచుకుని, వైరస్​ను చైనా అదుపు చేసుకుందని ఆరోపించారు పాంపియో. మహమ్మారిగా మారిన వైరస్​ను డిసెంబర్ 31న నిమోనియా కేసులుగా వుహాన్ అధికారులు నివేదించారని పేర్కొన్నారు. ఈ వైరస్ వుహాన్​లోని వైరాలజీ ప్రయోగశాలలో ఉద్భవించిందని, దీనిని ప్రపంచ దేశాలు అంగీకరించాలన్నారు పాంపియో.

ఇదీ చూడండి: 'కిమ్​ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం'

Last Updated : Apr 24, 2020, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.