అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరో నలుగురిని బలిగొంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఒక దగ్గరికి చేరిన స్నేహితులు, కుటుంబ సభ్యులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన మిగతా ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. నిందితులు కాలినడకన వచ్చి కాల్పులు జరిపారని... బాధితులు వారిని గుర్తించలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: బిడెన్‌పై ఉత్తరకొరియా అనుచిత వ్యాఖ్యలు.. ట్రంప్ వ్యంగ్యం