ETV Bharat / international

ఈనెల 3న 'యూఎస్​ఐఎస్​పీఎఫ్'​ సదస్సులో మోదీ ప్రసంగం! - Leadership Summit of US India Strategic and Partnership Forum

వారం రోజుల పాటు జరగనున్న యూఎస్​-భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం వార్షిక సదస్సులో భాగంగా ఈనెల 3న ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. యూఎస్ఐఎస్​పీఎఫ్​లో మోదీ ప్రసంగించటం ఇరు దేశాల సంబంధాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.

PM Modi to address Leadership Summit
యూఎస్​ఐఎస్​పీఎఫ్​లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం!
author img

By

Published : Sep 2, 2020, 5:05 AM IST

Updated : Sep 2, 2020, 6:19 AM IST

అమెరికా, భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం( యూఎస్​ఐఎస్​పీఎఫ్​) మూడో వార్షిక సదస్సులో భాగంగా గురువారం (సెప్టెంబర్​ 3న) ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల భాగస్వామ్యంపై కీలక ప్రసంగం చేయనున్నారని ఫోరం నిర్వాహకులు వెల్లడించారు.

"యూఎస్​ఐఎస్​పీఎఫ్​ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించేందుకు సమయం కేటాయించటం సంతోషించదగ్గ విషయం. అది ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికా-భారత్​ సంబంధాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. భౌగోళికంగా, రాజకీయంగా, వాణిజ్యం, సాంస్కృతికం, దౌత్య, శాస్త్రీయంగా ఇరు దేశాల భాగస్వామ్యం పరస్పరం ఆధారపడి ఉంది. చైనా దూకుడు చర్యలతో ఇరు దేశాలు మరింత సహకరించుకోవాల్సిన అవసరాన్ని చూపుతోంది."

- ముకేశ్​ అగి, యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు

వారం రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలి రోజు (సోమవారం) అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ చైనాపై తీవ్ర విమర్శలు చేశారు. అదే రోజు ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ పాల్గొన్నారు. మంగళవారం రోజున వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్​​ గోయల్​ హాజరయ్యారు.

ఇదీ చూడండి: ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్​ వద్దంట!

Last Updated : Sep 2, 2020, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.