అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi us visit 2021) శనివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో(un general assembly 2021) నేడు ప్రసంగించనున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి(Corona virus) కారణంగా ఐరాస సాధారణ సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు.
అంతకు ముందు శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో(America president Joe Biden) భేటీ అయ్యారు మోదీ. ద్వైపాక్షిక అంశాలు, అఫ్గాన్(Afghanistan crisis) సహా తాజా అంతర్జాతీయ పరిస్థితలుపై చర్చించారు. ఆ తర్వాత క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ భేటీకి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యొషిహిదే సుగాలు హాజరయ్యారు. అనంతరం వాష్టింగ్టన్ నుంచి న్యూయార్క్ చేరుకున్నట్లు ట్వీట్ చేశారు.
-
Landed in New York City. Will be addressing the UNGA at 6:30 PM (IST) on the 25th. pic.twitter.com/CUtlNZ83JT
— Narendra Modi (@narendramodi) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Landed in New York City. Will be addressing the UNGA at 6:30 PM (IST) on the 25th. pic.twitter.com/CUtlNZ83JT
— Narendra Modi (@narendramodi) September 25, 2021Landed in New York City. Will be addressing the UNGA at 6:30 PM (IST) on the 25th. pic.twitter.com/CUtlNZ83JT
— Narendra Modi (@narendramodi) September 25, 2021
"న్యూయార్క్ సిటీలో ల్యాండ్ అయ్యాను. 25వ తేదీన జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సాయంత్రం 6.30 గంటలకు ప్రసంగించనున్నాను. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం 109 మంది ప్రపంచ నేతలు నేరుగా ప్రసంగించున్నారు. మిగిలిన వారు తమ ప్రసంగాన్ని ముందుగా రికార్డ్ చేసి పంపనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది సెప్టెంబర్‌లో వర్చువల్‌గా నిర్వహించారు. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రికార్డ్ చేసి పంపారు.
' 76వ ఐరాస జనరల్ అసెంబ్లీలో 130 కోట్ల మంది భారతీయుల గొంతుకను వినిపించేందుకు ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం భారత్ ముఖ్య భూమిక పోషిస్తోంది.'
- ఆరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి.
ఇదీ చూడండి: ప్రపంచానికి మేలు చేసే శక్తిగా క్వాడ్: మోదీ