ETV Bharat / international

సరిహద్దు అంశమై మోదీ సంతృప్తిగా లేరు: ట్రంప్ - china, india war

భారత్​, చైనా సరిహద్దు అంశమై నెలకొన్న ఉద్రిక్తతలను రూపుమాపే దిశగా మధ్యవర్తిత్వం వహిస్తానని మరోసారి ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాతో సరిహద్దు అంశమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు.

trump
సరిహద్దు అంశమై మోదీ సంతృప్తిగా లేరు: ట్రంప్
author img

By

Published : May 29, 2020, 8:16 AM IST

భారత్​, చైనా సరిహద్దు అంశమై కొద్దిరోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని మరోసారి ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య చైనాతో సరిహద్దు అంశమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతృప్తిగా లేరని చెప్పారు.

భారత్​, చైనా సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని బుధవారం ట్వీట్ చేసిన డొనాల్డ్​.. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని గుర్తుచేశారు. ఇరుదేశాల మధ్య అతిపెద్ద వివాదం కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల్లోనూ జనాభా ఎక్కువని.. రెండింటికీ సమర్థ సైన్యం ఉందని పేర్కొన్నారు ట్రంప్.

"ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంభాషించాను. ఆయన చైనాతో సరిహద్దు అంశమై నెలకొన్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అయితే ట్రంప్ ట్వీట్​ ప్రతిపాదనపై ఇప్పటికే అత్యంత సున్నితంగా సమాధానం ఇచ్చింది భారత్. చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుతంగా చర్చలు జరుగుతాయని చెప్పింది. ఇరువైపులా సైన్యం, దౌత్యవేత్తల స్థాయిలో చర్చలు జరుగుతాయని పేర్కొంది.

స్పందించని చైనా..

అధ్యక్షుడి ప్రతిపాదనకు చైనా ఇంకా స్పందించలేదు. అయితే చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్.. అమెరికా అధ్యక్షుడి నుంచి అటువంటి సహకారం తమకు అవసరం లేదని పేర్కొంది.

ఇదీ జరిగింది..

మే 5న తూర్పు లద్దాఖ్​లో ఇరుదేశాల సైనికుల మధ్య బాహాబాహీ జరిగింది. ఇది మరుసటి రోజు కూడా కొనసాగింది. అయితే కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చ అనంతరం ఈ ఘర్షణను ఆపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర సిక్కింలో మే 9న ఇదే తరహా పరిణామం జరిగింది. నాకులా పాస్​ వద్ద 150మంది భారత జవాన్లతో చైనా సైనికులు ఘర్షణకు దిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.