ETV Bharat / international

తింటూ వీడియో గేమ్ ఆడితే మీ పని అంతే!

మీరు తింటూ ఆటలు ఆడతారా? ఒక చేతితో తింటూ మరో చేతితో వీడియో గేమ్​లో స్కోరింగ్​ ఇరగదీస్తారా? అయితే ఇక మీ పని అంతే అంటున్నారు పరిశోధకులు. తింటూ వీడియో గేమ్స్ ఆడితే శరీరానికి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

Playing games while eating may cut food intake says  US Researchers from the University of Illinois at Urbana-Champaign
తింటూ వీడియో గేమ్​లు ఆడితే.. మీ పని అంతే!
author img

By

Published : Mar 10, 2020, 1:54 PM IST

కంప్యూటర్​లో ఆటలు ఆడుతూ ఆహారం తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు పరిశోధకులు. ఆటలు ఆడుతూ తినడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటామని అమెరికాకు చెందిన అర్బనా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయం చేసిన సర్వే తేల్చింది. సరిపడా తినకపోవడం వల్ల శరీరంలో పోషకాలు లోపిస్తాయని హెచ్చరించింది.

కంప్యూటర్​ ఆటలు ఒక వ్యక్తి తీసుకునే పోషకాలపై ఎంతమేర ప్రభావం చూపుతాయో అని 119 మంది యువకులపై పరిశోధన చేశారు. ఎలాంటి పరధ్యానం లేని వారు 15 నిమిషాల సమయంలో తీసుకునే ఆహారంతో పోలిస్తే.. కంప్యూటర్​లో​ ఆటలు ఆడుతూ తినే వారి ఆహార పరిమాణం గణనీయంగా తగ్గిందని చెప్పారు పరిశోధకులు.

శ్రద్ధగా తినకపోతే అంతే..

కొన్ని సందర్భాల్లో వీడియో గేమ్​లలో మునిగితే ఎంత తిన్నది కూడా లెక్క ఉండట్లేదని తెలిపారు శాస్త్రవేత్తలు. ఇలా తింటూ ఆటలాడే అలవాటు ఉన్న ఒకరు అల్జీమర్స్ వ్యాధి, శ్రద్ధాలోపం వంటి రుగ్మతల బారిన పడ్డారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అనాథ శవాలకు అన్నీతానై అంతిమ సంస్కారాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.