ETV Bharat / international

'వైరస్​కు రక్త ఇన్​ఫెక్షన్లు తోడైతే మరింత ప్రమాదం' - అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయం

కొవిడ్​-19 లక్షణాలతో పాటు రక్త ఇన్​ఫెక్షన్లు తోడైతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందని రట్జర్స్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. 375 మంది రోగులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు... కొవిడ్​తో పాటు రక్త ఇన్​ఫెక్షన్​ ఉన్న రోగుల్లో మరణాలు 50శాతానికి మించి ఉన్నట్లు పేర్కొన్నారు.

People with severe COVID-19 and secondary blood infections may have worse health outcomes says a Study
కొవిడ్​-19కు రక్త ఇన్​ఫెక్షన్లు తోడైతే మరింత ప్రమాదం
author img

By

Published : Dec 29, 2020, 8:20 AM IST

తీవ్రమైన కొవిడ్-19 లక్షణాలతో బాధపడే వారికి రక్త ఇన్​ఫెక్షన్లు తోడైతే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివలన ఎక్కువ కాలం ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రట్జర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మార్చి నుంచి మే మధ్యలో కొవిడ్-19 తీవ్రంగా ఉన్న 375 రోగులపై వీరు పరిశోధన చేశారు. ఇందులోంచి రక్త ఇన్​ఫెక్షన్లు సోకిన 128 మంది నమూనాలను పరిశీలించారు.

"ఈ రోగుల్లో మానసికస్థితి మారిపోయింది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్​లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని ఈ పరిశోధన పత్రం సహ రచయిత పింకీ భట్ తెలిపారు. ఈ రోగుల్లో మరణాల రేటు కూడా 50 శాతానికి మించి ఉందని వెల్లడించారు. వీరి పరిశోధన పత్రాన్ని 'ది జర్నల్ క్లినికల్ ఇన్​ఫెక్షియస్ డిసీజెస్' ప్రచురించింది.

ఇదీ చదవండి:చైనాను ఎదుర్కోవాలంటే అలా చేయాల్సిందే: బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.