ETV Bharat / international

టార్గెట్​ చైనా: బలగాల కూర్పుపై బైడెన్ తర్జనభర్జన - biden latet news

అమెరికాలో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి బలగాల మోహరింపు విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది. ప్రపంచ శాంతికి కీలకమైన పశ్చిమాసియా వంటి ప్రాంతాల్లో మోహరింపులను తగ్గించకుండా... చైనా, రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడం బైడెన్​ సర్కారుకు సవాలుగా మారింది.

Pentagon rethinking how to array forces to focus on China
టార్గెట్​ చైనా: బలగాల కూర్పుపై చైనా తర్జనభర్జన
author img

By

Published : Feb 17, 2021, 2:26 PM IST

ప్రపంచ నలుమూలలా అమెరికా సైనికులు ఉంటారు. పెద్దన్న పాత్ర పోషించడంలో అగ్రరాజ్యానికి ఇది ఎంతో కీలకం. అయితే.. ఈ భద్రతా దళాల కూర్పు రూపంలో అగ్రరాజ్యానికి కొత్త సమస్య వచ్చి పడింది. మరి దీనిని నూతన అధ్యక్షుడు జో బైడెన్​ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తారు?

సమీక్షతో..

పశ్చిమాసియాలోనే అమెరికా బలగాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో చైనా, రష్యా నుంచి అగ్రరాజ్యానికి అనేక సవాళ్లు ఎదురువుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఎక్కువ మార్పులు చేయకుండానే చైనా, రష్యాపై దృష్టిపెట్టాలని అమెరికా యోచిస్తోంది. ఇది ఒక సమస్య. బడ్జెట్ వ్యవహారం​ మరో సమస్య.

ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు.. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. అంతర్జాతీయంగా బలగాల మోహరింపుపై సమీక్షకు ఆదేశించారు లాయిడ్​ ఆస్టిన్​. బైడెన్​ విదేశీ విధానానికి తగ్గట్టుగా.. దళాలు, ఆయుధాలు, శిబిరాలను ఎలా వినియోగించవచ్చో తేల్చడమే ఈ సమీక్ష ముఖ్యోద్దేశం.

ఇదీ చూడండి:- చైనా కట్టడికి అమెరికా 'టాస్క్​ఫోర్స్​' వ్యూహం

ట్రంప్​ చర్యలతో..

యుద్ధానికి సర్వసన్నద్ధమై ఉండాలన్న అగ్రరాజ్య సైనిక ప్రాధాన్యంపై ఈ సమీక్ష దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది. అదే సమయంలో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 'అమెరికా ఫస్ట్​' విధానంతో మిత్ర దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను కూడా బైడెన్​ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు.. అఫ్గానిస్థాన్​ నుంచి పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తికమక పడుతోంది బైడెన్​ బృందం. దానిపైనా సమీక్షలో స్పష్టత వచ్చే అవకాశముంది.

టార్గెట్​ చైనా

చైనా విషయంలో ట్రంప్​, బైడెన్​ వైఖరి ఒకే విధంగా ఉంది. ఐసిస్​, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థల కన్నా చైనా నుంచి ఎక్కువ సవాళ్లు ఎదురువుతాయని నాడు ట్రంప్​ విశ్వసించారు. ఇప్పుడు బైడెన్​ కూడా అదే ధోరణిలో ఉన్నారు. అదే సమయంలో ఐరోపాకు బైడెన్​ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరుణంలో బలగాల మోహరింపులో చెప్పుకోదగ్గ మార్పులు జరిగే అవకాశముంది.

సాంకేతికత, భౌగోళిక రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. బలగాల మోహరింపులో పాటిస్తున్న పాత పద్ధతికి స్వస్తి చెప్పాలని జాయింట్​ చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ ఛైర్మన్​ మార్క్​ మిల్లే అభిప్రాయపడ్డారు. బలగాలను చిన్న చిన్న బృందాలుగా విభజించాలని సూచించారు. అలా అయితే వాటిని అన్నివైపులా మోహరించేందుకు వీలుంటుందని.. ఎవరూ గుర్తించకుండా వేగంగా కదిలేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు.

అటు పసిఫిక్​ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేసేందుకు అమెరికా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

రష్యాతో..

అదే సమయంలో ఆర్కిటిక్​లో రష్యా ఆధిపత్యంపైనా ఆందోళన వ్యక్తం చేశారు ఆస్టిన్​. ఆ ప్రాంతంలో రష్యా బలగాల దూకుడు ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:- సూకీ నిర్బంధం పొడిగింపుపై అమెరికా ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.