అమెరికా చట్టసభల నిలయమైన క్యాపిటల్ భవనంపై దాడులకు అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మరో రెండు నెలల పాటు జాతీయ భద్రతాదళాల్ని అక్కడే మోహరించి ఉంచాలని పెంటగాన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లైయాడ్ ఆస్టిన్ తెలిపారు. ప్రస్తుతం 2,300 మంది నేషనల్ గార్డులు.. కాపిటల్ వద్ద విధుల్లో ఉన్నారు. అయితే.. క్యాపిటల్ పోలీసులు విజ్ఞప్తి మేరకు వారిని మే 23వరకు కొనసాగించనున్నట్లు ఆస్టిన్ చెప్పారు.
వాషింగ్టన్ మొత్తం మీద ప్రస్తుతం 5,100 మంది నేషనల్ గార్డు సిబ్బంది ఉన్నారు. వారందరూ ఈ వారంలో వాషింగ్టన్‌ను వదిలి వెళ్లాల్సి ఉండగా.. మార్చి 12తో ముగిసే గడువును మే 23 వరకు పొడిగించారు. రెండు నెలల క్రితం.. క్యాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటి నుంచి క్యాపిటల్‌తో పాటు వాషింగ్టన్‌లో నేషనల్ గార్డులను మొహరించారు.
ఇదీ చూడండి:'చైనాను కట్టడి చేసేందుకు 'క్వాడ్'లో చేరాం'