ETV Bharat / international

'అమెరికాలో ఉగ్రదాడికి పాక్ వైద్యుడి కుట్ర'

యూఎస్ ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ... పాకిస్థాన్​కు చెందిన మహ్మద్ మసూద్ అనే వైద్యుడిపై ఉగ్రవాదిగా అభియోగాలు మోపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితుడైన నిందితుడు ... ఒంటరిగానే అమెరికాలో ఉగ్రదాడులు చేయడానికి ప్రణాళికలు రచించాడని పేర్కొంది. మార్చి 19న అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

Pakistani doctor planning to carry out 'lone wolf' terror attacks in US indicted
అమెరికాపై ఉగ్రదాడికి పాకిస్థానీ వైద్యుడి ప్లాన్​
author img

By

Published : May 16, 2020, 3:42 PM IST

పాకిస్థాన్​కు చెందిన యువ వైద్యుడు మహ్మద్ మసూద్​ ... అమెరికాలో ఒంటరిగా ఉగ్రదాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫెడరల్​ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. హెచ్​-1బీ వీసా కలిగిన ఈ పాకిస్థానీ డాక్టర్​... ఇస్లామిక్ స్టేట్ ముష్కర మూకకు విధేయుడని అధికారులు తెలిపారు.

మసూద్​పై చేసిన నేరారోపణలను యూఎస్ అటార్నీ ఎరికా మెక్ డొనాల్డ్ శుక్రవారం ప్రకటించారు. మసూద్​పై వచ్చిన ఫిర్యాదుల మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

"మసూద్​ ఈ ఏడాది జనవరి, మార్చి నెలల మధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థకు, దాని నాయకుడికి విధేయత ప్రకటించుకున్నాడు. అలాగే ఐసీసీ తరపున పోరాడడానికి సిరియా వెళ్లాలనుకున్నాడు. ఆ తరువాత అమెరికాలో... ఒంటరిగానే ఉగ్రదాడులు చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు."

- మెక్ డొనాల్డ్, యూఎస్ అటార్నీ జనరల్

పాకిస్థాన్​ నుంచి వైద్యుడిగా లైసెన్స్ పొందిన మహ్మద్ మసూద్​... గతంలో మిన్నెసొటా, రోచెస్టర్​లోని ఓ ప్రసిద్ధ మెడికల్ క్లినిక్​లో పరిశోధన సమన్వయకర్తగా పనిచేశాడని అధికారులు గుర్తించారు.

కరోనాతో మారిన ప్లాన్

ఈ ఏడాది ఫిబ్రవరి 21న మసూద్​ షికాగో నుంచి జోర్డాన్​లోని అమాన్​కు విమాన టికెట్టు కొనుక్కున్నాడు. అక్కడి నుంచి సిరియా వెళ్లాలని అనుకున్నాడు. అయితే కరోనా విజృంభణ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేయడం వల్ల... మార్చి 16 తరువాత మసూద్ తన ప్లాన్ మార్చుకున్నాడు.

మిన్నియాపాలిస్ నుంచి లాస్ ఏంజెల్స్​కు వెళ్లడానికి ప్రయత్నించాడు. అక్కడ నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి... తనను కార్గో షిప్​ ద్వారా ఐసిస్ ఉగ్రవాదుల నిలయమైన సిరియాకు చేరుస్తాడని నమ్మాడు. అందుకోసం మార్చి 19న రోచెస్టర్ నుంచి మిన్నియాపాలిస్ - సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఎఫ్​బీఐ, జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ అధికారులు.. మసూద్​ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం మసూద్​ను షేర్బర్న్ కౌంటీ జైలులో నిర్బంధించారు.

ఇదీ చూడండి: జిన్​పింగ్​​తో మాట్లాడాలనుకోవట్లేదు: ట్రంప్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.