ETV Bharat / international

'ఎన్నో సవాళ్లున్నాయి- అన్నీ పరిష్కరిస్తాం!'

ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించాలంటే ముందుగా దేశీయ సవాళ్లపైనే దృష్టిసారించాలని ఆ దేశ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. కరోనాను నియంత్రించడం, అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, దేశ భద్రతను పెంపొందించడం వంటివి ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Overcoming domestic challenges key to restoring US global leadership
'అమెరికా పునర్​వైభవానికి దేశీయ సవాళ్ల పరిష్కారమే మార్గం'
author img

By

Published : Nov 25, 2020, 11:30 AM IST

అధికార పగ్గాలు చేపట్టగానే తమకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. కరోనాను నియంత్రించడం తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను బాధ్యతాయుతంగా పునరుద్ధరించడం, కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించాలనుకుంటే తొలుత దేశీయ సవాళ్లపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

"శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత నాతో పాటు.. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు వరుస సవాళ్లు ఎదురవుతాయని మాకు ఎప్పుడో తెలుసు. వీటిని పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమెరికా సన్నిహిత దేశాలను ఒక్కచోటికి చేర్చాలి. దేశ భద్రత పెంపొందించాలి. అమెరికా ప్రయోజనాలను కాపాడే విదేశాంగ విధానాలను బలోపేతం చేయాలి. అందరికీ ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పులను ఎదుర్కొని పోరాడాలి."

-కమలా హారిస్, అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలు

ఈ సమస్యలన్నింటినీ చాలా తీవ్రమైనవిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు హారిస్. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకే తన పూర్తి జీవితాన్ని అంకితం చేసినట్లు చెప్పారు. అమెరికా ప్రజలకు ఏది మంచిదో దాన్ని చేయడంపైనే జో బైడెన్ దృష్టిసారించారని చెప్పారు.

ఇదీ చదవండి- రికార్డు సృష్టించిన ఒబామా 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.