ETV Bharat / international

Afghanistan: అఫ్గాన్ నుంచి ప్రజల తరలింపుపై అమెరికా స్పష్టత

author img

By

Published : Aug 26, 2021, 9:28 AM IST

అఫ్గాన్​లో సంక్షోభం (Afghanistan crisis) నెలకొన్న వేళ.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతర దేశాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే.. తమ దేశ పౌరులతో పాటు, అఫ్గాన్ వాసులు, ఇతరులు కలిపి మొత్తం (Evacuation from Afghan) 82 వేల మందిని తరలించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని (US deadline to leave Afghan) స్పష్టం చేసింది.

people leaving Afghanistan
అఫ్గాన్​ను వీడుతున్న ప్రజలు

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత (Afghan crisis) ఇప్పటి వరకు 82 వేల మందిని సురక్షితంగా ఆ దేశం (Evacuation from Afghan) నుంచి తరలించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ తెలిపారు. ఇందులో 19 వేల మందిని బుధవారం ఒక్కరోజే తరలించినట్లు వెల్లడించారు.

ఆగస్టు 14 నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభమవగా.. దాదాపు 6,000 మంది అమెరికన్లు అఫ్గాన్​ను వీడాలనుకుంటున్నట్లు అమెరికా అంచనా వేసింది. ఇందులో 4,500 మందిని ఇప్పటికే తరలించింది. మరో 1500 వందల మంది అమెరికా పౌరులను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ విధించిన గడువు (ఆగస్టు 31)లోపే (US deadline to leave Afghan) తరలించే అవకాశముందని బ్లింకెన్​ తెలిపారు. అయితే చాలా ఏళ్లుగా తమకు అండగా ఉన్న అఫ్గాన్​ వాసులతో పాటు.. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న అమెరికన్లకు సాయపడానికి మాత్రం తమకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

అఫ్గాన్​కు అమెరికా చట్టసభ్యులు..

అఫ్గాన్​లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్న వేళ.. అమెరికాకు చెందిన ఇద్దరు చట్ట సభ్యులు కాబుల్​ విమానాశ్రయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా..వారు పర్యటన చేపట్టడంపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెథ్​ మౌల్టన్​ (డెమొక్రాట్​), పీటర్​ మీయర్​ (రిపబ్లికన్​) ప్రత్యేక విమానంలో మంగళవారం ఆకస్మికంగా కాబుల్​ విమానాశ్రయానికి వెళ్లారు. వీరిద్దరూ గతంలో సైన్యంలో పని చేసిన వారే కావడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.