ETV Bharat / international

హబుల్ టెలిస్కోప్​లో సాంకేతిక సమస్య

30 ఏళ్లకుపైగా అంతరిక్షంలో ఉంటూ.. విశ్వం గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడిన హబుల్ టెలిస్కోప్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను పరిష్కరించేందుకు తమ బృందాలు కృషి చేస్తున్నట్లు నాసా ప్రకటించింది.

reasons to Hubble Space Telescope Glitches
హబుల్ టెలిస్కోప్​ సమస్యకు కారణాలు
author img

By

Published : Jun 17, 2021, 12:59 PM IST

విశ్వం గురించి అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషించిన హబుల్ స్పేస్​ టెలిస్కోప్​లో సాంకతిక సమస్య తెలత్తింది. టెలిస్కోప్​లోని పేలోడ్​ కంప్యూటర్​లో ఈ సమస్య ఏర్పడినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది.

జూన్ 13 (ఆదివారం) సాయంత్రం 4 గంటల నుంచి ఈ కంప్యూటర్ పని చేయడం ఆగిపోయినట్లు తెలిపింది నాసా. సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.

సమస్యకు అదే కారణమా?

స్టోరేజీలో సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు నాసా వివరించింది. బ్యాకప్​ మోడ్యూల్స్​లో ఒకదాన్ని ప్రత్యమ్నాయంగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా ఒక రోజు గడిచిన తర్వాతే సమస్య తొలగిందని భావించనున్నట్లు చెప్పింది. అప్పుడు మాత్రమే టెలిస్కోప్​ ఇతర ఆపరేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

టెలిస్కోప్​లోని శాస్త్రీయ విడిభాగాలను నియంత్రించటమే ఈ పేలోడ్ కంప్యూటర్​ ముఖ్య ఉద్దేశం.

హబుల్​ టెలిస్కోప్ గురించి..

శాస్త్రవేత్తలు విశ్వం గురించి చేసే అధ్యయనంలో హబుల్ టెలిస్కోప్‌ కీలక పాత్ర పోషించింది. ఆకర్షణీయమైన, అద్భుతమైన చిత్రాలను తీసి, పరిశోధకులు విశ్వం గురించి లోతుగా అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలకు ఇంతగా సహకరించే ఈ హబుల్ టెలిస్కోప్‌ను అమెరికన్ స్పేస్‌ సంస్థ నాసా 1990లో లాంచ్ చేసింది.

ఇదీ చదవండి:రోదసిలోకి చైనా వ్యోమగాములు- అసలు లక్ష్యం అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.