ETV Bharat / international

బాల్యంలోనే ఎయిడ్స్​ ముప్పు: యూనిసెఫ్​ - యూనిసెఫ్​ హెచ్​ఐవీ గణాంకాలు

ప్రపంచాన్ని ఓ వైపు కరోనా కలవరపెడుతుంటే.. మరోవైపు హెచ్​ఐవీ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఓ వ్యక్తికి హెచ్​ఐవీ​ సోకుతుందని యూనిసెఫ్​ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 20ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉన్నారని తెలిపింది. 2019లో 3.20 లక్షల మంది హెచ్​ఐవీ బారినపడగా.. వారిలో 1.10లక్షల మంది చనిపోయారని పేర్కొంది యూనిసెఫ్​.

One child or teen infected with HIV every 100 seconds last year: UNICEF
బాల్యంలోనే ఎయిడ్స్​ ముప్పు: యూనిసెఫ్​
author img

By

Published : Nov 26, 2020, 10:18 AM IST

ప్రపంచానికి ఎయిడ్స్‌ ముప్పు ఇంకా తొలగలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఒకరు హెచ్​ఐవీ బారిన పడుతున్నారని యునైటెడ్​ నేషన్స్​ ఇంటర్నేషనల్​ చిల్డ్రన్స్​ ఎమర్జెన్సీ ఫండ్​(యూనిసెఫ్​) వెల్లడించింది. వీరిలో 20 ఏళ్లలోపు యువకులు, పిల్లలే అధికం. గతేడాది మొత్తం 28 లక్షల మందికి ప్రమాదకర హెచ్​ఐవీ సోకగా.. వారిలో 3.20 లక్షల మంది 20ఏళ్ల లోపువారే ఉన్నారని యూనిసెఫ్​ పేర్కొంది. వైరస్​ బారినపడిన వారిలో 1.10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

చిన్న పిల్లలకు హెచ్​ఐవీ సోకకుండా చూడటం, వచ్చిన తరువాత నివారించడంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలని యూనిసెఫ్​ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాధి నిరోధక చర్యలు అంత సంతృప్తికరంగా లేవని పేర్కొంది. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం దేశాల్లో వ్యాధి తీవ్రత అధికంగా కనిపిస్తున్నట్టు వివరించింది.

కరోనాతో పాటు ఎయిడ్స్‌ కూడా ప్రపంచాన్ని వణికిస్తున్నట్టు యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్నియెట్టా ఫోర్‌ తెలిపారు. ఎయిడ్స్‌ నివారణకు ఇంకా టీకా రాకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారని చెప్పారు. 10.30 లక్షల మంది గర్భిణులకు ఈ వ్యాధి సోకందని.. ఫలితంగా 68 వేల మంది చిన్నారులు పాలు తాగే దశలోనే ఎయిడ్స్‌ మహమ్మారి బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. 82వేల మంది అయిదేళ్లలోపు పిల్లలు కూడా వ్యాధికి గురయ్యారు. కరోనా కారణంగా ఇలాంటి వారికి తగిన వైద్య సేవలు అందలేదని తెలిపారు.

ఇదీ చదవండి: 'ఆ రోజు.. జోలపాట అలా ఆగిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.