ETV Bharat / international

Omicron Scare: సింగిల్​ లేయర్ మాస్క్​ మంచిదేనా? - ఒమిక్రాన్ వ్యాప్తి

Omicron Scare: ఒమిక్రాన్ వ్యాప్తి ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. అయితే.. ఈ వేరియంట్​కు అడ్డుకట్ట వేసేందుకు మంచి మాస్కులు ధరించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్​ లేయర్ మాస్క్​ మంచిదేనా? అనే విషయంపై అమెరికాకు చెందిన వైద్య నిపుణులు స్పష్టత ఇచ్చారు.

single layer mask
సింగిల్ లేయర్ మాస్క్
author img

By

Published : Dec 26, 2021, 6:39 AM IST

Omicron Scare: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. దాని వేగానికి అడ్డుకట్ట వేయాలంటే మనం కొవిడ్ నియమాలు పాటించాల్సిందే. అందులో మాస్క్‌ మరింత కీలకం. మనమంతా మాస్కులు ధరిస్తున్నప్పటికీ.. ఏ తరహా మాస్కుల వాడకం ముఖ్యమో మరోసారి నిపుణులు సూచనలు చేస్తున్నారు. వేగంగా ప్రబలే లక్షణమున్న ఒమిక్రాన్‌ విషయంలో సింగిల్ లేయర్(ఒక్కటే పొర) మాస్కుల వాడకపోవడమే మేలని సిఫార్సు చేస్తున్నారు.

కరోనా ప్రారంభ దశలో వైద్య సిబ్బందిని ఎన్‌95 మాస్కుల కొరత వేధించేది. దాంతో సాధారణ ప్రజలు క్లాత్‌ మాస్కులు వాడేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. అయితే ఒమిక్రాన్‌ కలవరం నేపథ్యంలో ప్రజలు ఎన్‌95, కే95 మాస్కులు వాడేలా నిపుణులు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం వాటి కొరత కూడా లేదు. మరోపక్క క్లాత్‌ మాస్కుల విషయంలో అలంకరణే ప్రాధాన్యంగా కనిపించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 'ఒమిక్రాన్ సమయంలో వాటికి చోటు లేదు. ఇదే విషయాన్ని వైద్యాధికారులు కొద్ది నెలలుగా చెప్తున్నారు' అంటూ అమెరికా చెందిన వైద్య నిపుణులు డాక్టర్ లీనా వెన్ అన్నారు. వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు కనీసం మూడు పొరల సర్జికల్ మాస్కు వాడాలని సూచించారు. ఇవి ఇప్పుడు సులభంగానే లభ్యమవుతున్నట్లు చెప్పారు. దానిపైన క్లాత్ మాస్కు ధరించవచ్చని, ఒక్క క్లాత్‌ మాస్కు మాత్రమే వద్దని చెప్పారు. మొత్తంగా ఎన్‌95, కే95 మాస్కుల వాడకం వైపు వెన్‌ మొగ్గు చూపారు. అయితే వాటిని ముఖానికి సరిగా అమరేలా ధరించాలని వెల్లడించారు.

Single Layer Face mask amid Omicron Surge:

కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రిష్ గ్రీన్‌హాల్గ్ పలు విషయాలు వెల్లడించారు. 'క్లాత్‌ మాస్కులు నిజంగా మంచివి కావొచ్చు లేక భయంకరమైన కావొచ్చు. రెండు మూడు పొరలతో ఉండే క్లాత్ మాస్కులు ప్రభావంతంగా పనిచేస్తాయి. కానీ, వాటి తయారీలో ఫ్యాషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వాటిని అలంకరణ వస్తువుగా చూస్తున్నారు. క్లాత్ మాస్కులతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. వాడే క్లాత్ విషయంలో ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే ఎన్‌95 మాస్కుల తయారీదారులు మాత్రం .. తమ మాస్కులు 95 శాతం కణాలను వడపోస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంది. మాస్కులు పనితీరు ఎంత గొప్పగా ఉన్నా.. ముక్కు, నోటిని వాటితో సరిగా మూయకపోతే అంతా నిష్ర్పయోజనమే. అదే సమయంలో సరిగా శ్వాసతీసుకోవాల్సిన అవసరమూ ఉంది' అని ట్రిష్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు

'ఒమిక్రాన్​పై పనిచేయని టీకాలు.. రెండు డోసులు తీసుకున్నా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.