ETV Bharat / international

'ఒమిక్రాన్​పై పనిచేయని టీకాలు.. రెండు డోసులు తీసుకున్నా...' - Omicron virus

Omicron variant vaccine effectiveness: ఒమిక్రాన్​ వేరియంట్​పై ప్రస్తుతం ఉన్న కొవిడ్​-19 వ్యాక్సిన్లు పనిచేయటం లేదని ఓ అధ్యయనం తేల్చింది. వ్యాక్సిన్లు, యాంటీబాడీ థెరపీ ద్వారా లభించే రక్షణ నుంచి ఒమిక్రాన్​ తప్పించుకోగలుగుతోందని పేర్కొంది. టీకా రెండు డోసులు తీసుకున్నా.. వైరస్​ బారినపడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అయితే, బూస్టర్​ డోస్​తో కొంతమేర రక్షణ ఉంటుందని తెలిపింది.

omicron
ఒమిక్రాన్​
author img

By

Published : Dec 24, 2021, 4:18 PM IST

Updated : Dec 24, 2021, 5:09 PM IST

Omicron variant vaccine effectiveness: కొవిడ్​-19 కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్'​పై ప్రస్తుత వ్యాక్సిన్లు పని చేస్తాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్న తరుణంలో.. ఓ అధ్యయనం పిడుగులాంటి విషయాన్ని వెల్లడించింది. కొవిడ్​ వ్యాక్సిన్లు, యాంటీబాడీ థెరపీల ద్వారా లభించే రక్షణ నుంచి ఒమిక్రాన్​ తప్పించుకోగలదని పేర్కొంది. సార్స్​ కోవ్​-2 వైరస్​ భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుందో అంచనా వేస్తూ కొత్త టీకాలు, చికిత్సలు రూపొందించడం అవసరమని పేర్కొంది.

అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, హాంగ్​కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒమిక్రాన్​ వేరియంట్​పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధన నేచర్ జర్నల్​లో ప్రచురితమైంది.

కొత్త వేరియంట్​ స్పైక్​ ప్రోటీన్​లో చాలా మార్పులు జరుగుతున్నాయని, నాలుగు మ్యుటేషన్లను గుర్తించినట్లు చెప్పారు పరిశోధకులు. అందువల్లే.. ప్రస్తుత వ్యాక్సిన్లు, థెరపీ యాంటీబాడీలను తట్టుకుని వేగంగా వ్యాప్తి చెందగలుగుతోందని పేర్కొన్నారు. ఒమిక్రాన్​ను తటస్థపరిచేందుకు వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తి అయిన యాంటీబాడీల సామర్థ్యాన్ని ల్యాబ్​లో పరీక్షించారు పరిశోధకులు. ఈ క్రమంలో మోడెర్నా, ఫైజర్​, ఆస్ట్రాజెనెకా, జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్న వారి యాంటీబాడీలు.. కొవిడ్​తో పోలిస్తే ఒమిక్రాన్​ను తటస్థీకరించటంలో ప్రభావం చూపలేకపోతున్నాయని గుర్తించారు. అలాగే.. గతంలో వైరస్​ బారిన పడిన వారి యాంటీబాడీలు సైతం ఒమిక్రాన్​ను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాయని పేర్కొన్నారు.

అయితే, ఫైజర్​, మోడెర్నా వ్యాక్సిన్​ బూస్టర్​ డోస్​ తీసుకున్న వారికి రక్షణ కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు.

" తాజా అధ్యయనం ప్రకారం గతంలో వైరస్​ బారిన పడిన వారు, పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ వేసుకున్న వారు సైతం ఒమిక్రాన్​ వేరియంట్​ బారినపడే ప్రమాదం ఉంది. బూస్టర్​ డోసు సైతం ఒమిక్రాన్​ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేకపోతోంది. కానీ, బూస్టర్​ తీసుకోవటం మంచిదని మా సలహా. దాని ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. "

- డేవిడ్​ హో, కొలంబో యూనివర్సిటీ ప్రొఫెసర్​.

అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మోనోక్లోనాల్​ యాంటీబాడీ థెరపీ సైతం ఒమిక్రాన్​పై అంతగా ప్రభావం చూపలేకపోతోందని తేల్చారు పరిశోధకులు. యాంటీబాడీలతో తటస్థీకరించే ప్రక్రియ నుంచి ఒమిక్రాన్​ పూర్తిగా తప్పించుకోగలుగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బూస్టర్ డోసు అవసరమేనా? కేంద్రం ఏం చేయనుంది?

ఒమిక్రాన్​ను ఎదుర్కోవడంలో చైనా టీకా విఫలం.. బూస్టర్​తోనూ రక్షణ నిల్!

'3 నెలల తర్వాత కొవిషీల్డ్ టీకా రక్షణ తగ్గదు..​'

Last Updated : Dec 24, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.