అమెరికా కాలిఫోర్నియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ తీరంలోని శాంటాక్రూజ్ దీవిలో ఓ ప్రయాణికుల పడవకు నిప్పుంటుకుంది. ఈ ఘటనలో 33 మంది గల్లంతయ్యారని అమెరికా తీర రక్షక దళం వెల్లడించింది.
తీరానికి 20 మీటర్ల దూరంలో స్కూబా డైవ్ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన కోస్ట్ గార్డులు ఐదుగురిని మాత్రమే రక్షించగలిగారు. మిగితా 33 మంది ఆచూకీ తెలియలేదని తెలిపారు. పడవలో ఎంత మంది ఉన్నారనే అంశంపై స్పష్టత లేదన్నారు.
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి