ETV Bharat / international

అమెరికా ఓట్ల లెక్కింపులో అక్రమాలు నిజమేనా? - అమెరికాలో భారీ కుట్ర

అమెరికా ఎన్నికల ప్రక్రియలో వైఫల్యాలపై జార్జియా పోలింగ్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పరికరాలు విఫలమయ్యాయని, బ్యాలెట్ల ముద్రణ గందరగోళంగా ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలపై అధ్యక్షుడు ట్రంప్ చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

US election
అమెరికా ఎన్నికల ప్రక్రియ
author img

By

Published : Nov 6, 2020, 12:48 PM IST

గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న అమెరికా ఎన్నికల్లో అవకతవకలు నిజమేనా? ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నాయా? స్కానర్లు, మెమరీ కార్డులు పనిచేయకున్నా జోబైడెన్​ ఆధిక్యం సంపాదిస్తున్నారా?

డొనాల్డ్ ట్రంప్​ ఆరోపణలతో ఈ ప్రశ్నలన్నీ చర్చనీయాంశమైన వేళ... సంచలన విషయాలు వెల్లడించారు జార్జియా ఎన్నికల అధికారి గేబ్రియెల్ స్టెర్లింగ్.

యంత్రాంగంలో వైఫల్యాలు..

ఓట్లకు సంబంధించి మెమరీ కార్డులు విఫలమయ్యాయని, సిస్టమ్​లో అప్​లోడ్ చేయని బ్యాలెట్లు, పోస్టల్ ఓట్లు ఉన్నాయని.. ఎన్నికల యంత్రాంగంలో వైఫల్యాలను ఎత్తిచూపారు గేబ్రియెల్.

"జార్జియాలోని టేలర్ కౌంటీలోని పోలింగ్ స్కానర్లలో పాడైన మెమరీ కార్డును ఉంచారు. ఫలితంగా బ్యాకప్​గా ఉంచిన బ్యాలెట్​ పేపర్లను మళ్లీ స్కాన్ చేయాల్సి వచ్చింది. లారెన్స్ అనే మరో కౌంటీలో 797 బ్యాలెట్లకు సంబంధించిన బ్యాచ్​లను గుర్తించే పనిలో ఉన్నాం. వాటిని సిస్టమ్​లో అప్​లోడ్​ చేశామని చెబుతున్నారు. కానీ, వాటి వివరాలు అందులో లేవు."

- గేబ్రియేల్ స్టెర్లింగ్

టేలర్​ కౌంటీలో పోస్టల్​ బ్యాలెట్లను వివిధ సైజుల్లో ముద్రించారని స్టెర్లింగ్ తెలిపారు. అందువల్ల బ్యాలెట్​ మార్కింగ్ పరికరాల్లో లెక్కింపు కోసం డూప్లికేట్​లను తయారు చేయాల్సి వస్తోందన్నారు. వీటిని అసలైన బ్యాలెట్లతో సరిపోల్చి ధ్రువీకరించాల్సి ఉంటుందని వివరించారు.

జార్జియాలో మొత్తం 159 కౌంటీలు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కౌంటీలో సిబ్బందిని వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేశారని స్టెర్లింగ్ తెలిపారు. జార్జియా చట్టం ప్రకారం ఎన్నికల రోజున రాత్రి 7 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్లను అంగీకరించాల్సి ఉంది. ఏదైనా సమస్య ఉంటే సదరు ఓటర్లకు తెలిపి 3 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికల విధానం.. గందరగోళం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో జాతీయ స్థాయి ఏకరూప నిబంధనలు లేవు. భారత్​ తరహాలో జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం లేకపోవటమే ఈ గందరగోళానికి కారణం. ఓట్ల నమోదు, ఎలక్టోరల్‌ కాలేజీ, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర అంశాల్లో.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అన్నట్టుగా నిబంధనలు ఉంటాయి. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రాష్ట్రం నిబంధనల ఆధారంగా తేల్చాలన్నది కష్టంగా మారుతుంది.

ట్రంప్ ఆరోపణలతో..

ట్రంప్ కొన్ని లోపాలను ఎత్తిచూపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో ఈ సారి సమస్యలు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ వ్యవస్థకు డెమొక్రాట్లు, మీడియా కూడా మద్దతుగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: 'బైడెన్​ నెగ్గిన అన్ని చోట్లా కేసులు.. మేమే గెలుస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.