ETV Bharat / international

ఆ నర్సింగ్ హోంలో కరోనాకు 98 మంది బలి

author img

By

Published : May 2, 2020, 12:22 PM IST

న్యూయార్క్​.. కరోనా వైరస్​తో విలవిలలాడుతున్న అమెరికా వాణిజ్య రాజధాని. ఆసుపత్రులతో పాటు న్యూయార్క్​ నర్సింగ్​ హోమ్స్​లోనూ పరిస్థితులు దయనీయంగా మారాయి. తాజాగా ఇసబెల్లా అనే నర్సింగ్​ హోంలో 98 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఇంకా ఎంత మందికి వైరస్​ సోకి ఉంటుందనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

NY nursing home reports 98 deaths linked to coronavirus
న్యూయార్క్​ నర్సింగ్​ హోంలో భారీగా మృతులు!

న్యూయార్క్​లోని ఓ​ నర్సింగ్​ హోంలో 98 మంది కరోనా వైరస్​ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం వల్ల అధికారులు కూడా షాక్​కు గురయ్యారు.

మాన్​హటన్​లోని ఇసబెల్లా గేరియాట్రిక్​ సెంటర్​లో వైరస్​ పాజిటివ్​గా తేలిన 46 మంది మరణించారు. మరో 52మంది కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. వీరికి వైరస్​ సోకినట్టు ఇంకా నిర్ధరణ కాలేదు.

న్యూయార్క్​వ్యాప్తంగా మృతదేహాలు కుప్పలుకుప్పలుగా ఉండటం వల్ల నర్సింగ్​ హోమ్స్​లో మరణిస్తున్న వారికి ఖననం చేయడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఇసబెల్లా సిబ్బంది రిఫ్రిజరేటర్లను ఆర్డ్​ర్​ చేయాల్సి వచ్చింది.

"న్యూయార్క్​లోని ఇతర నర్సింగ్​ హోమ్స్​ లాగానే ఇసబెల్లాలో కూడా ఆరోగ్య వసతులు సరిగ్గా లేవు. ఇక్కడ ఉంటున్న వారికి, సిబ్బందికి పరీక్షలు నిర్వహించడం ఆలస్యమైంది. దీంతోపాటు లక్షణాలు కనిపించని​ కేసుల వల్ల పరిస్థితులు మారిపోయాయి. ఎవరికి వైరస్​ ఉందో? లేదో? తెలుసుకోవడం కష్టమైంది. వైరస్​ లక్షణాలున్న వారిని వేరు చేసినా ఫలితం దక్కలేదు. ఇసబెల్లాలో సిబ్బంది కొరత ఉండేది. ఇతర సంస్థల వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాం. వారికి పీపీఈ కిట్లు అందించడం తొలినాళ్లలో పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి."

--- ఆండ్రూ వాల్టర్స్​, ఇసబెల్లా ప్రతినిధి.

ఈ విషయంపై న్యూయార్క్​ మేయర్​ బిల్​ డే బ్లాసియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ప్రాంతంలోనే అంతమంది మరణించారన్న వార్త కలచివేస్తోందన్నారు.

వైరస్​ ఉద్ధృతికి న్యూయార్క్​ అంతటా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ఆసుపత్రుల్లోని వైద్యులు చేతులెత్తేశారు. నర్సింగ్​ హోమ్స్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యూయార్క్​లోని నర్సింగ్​ హోమ్స్​లో 3 వేల 65 మంది మరణించారు.

అయితే ఇసబెల్లాలో మృతుల సంఖ్య 13గా ఉన్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసబెల్లాపై పలు ఆరోపణలు వచ్చాయి. వైరస్​ వ్యాప్తి విషయాన్ని ప్రభుత్వం వద్ద దాచిపెట్టిందని న్యూయార్క్​ డెమొక్రాట్​ నేత ఒకరు మండిపడ్డారు. అయితే మృతుల సంఖ్యలో ఇంత తేడా ఎందుకుందనే విషయం తమకు అర్థం కావడం లేదని ఇసబెల్లా పేర్కొంది. ఈ మేరకు అధికారులకు ఓ లేఖను పంపింది.

ఇదీ చూడండి:- కరోనా కారణంగా ఆధిపత్య పోరు పెరగనుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.