ETV Bharat / international

క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా దూకుడు- అమెరికా ఆందోళన! - north korea us conflict

North Korea vs US: ప్రపంచదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్తరకొరియా తన క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. ఇటీవల ఉత్తరకొరియా జరిపిన బాలిస్టిక్​ క్షిపణి పరీక్షపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. కిమ్​ సర్కారును ఇలాగే వదిలేస్తే మరిన్ని ప్రమాదకరమైన క్షిపణి ప్రయోగాలు చేస్తుందని హెచ్చరించింది.

North Korea Missile Tests
North Korea Missile Tests
author img

By

Published : Mar 11, 2022, 11:08 AM IST

North Korea vs US: ఉత్తరకొరియా.. అమెరికాకు కొరకరాని కొయ్యిగా మారింది. ఓవైపు రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుద్ధం జరుగుతున్నా.. కిమ్​ సర్కారు ఏమాత్రం చలించడం లేదు. అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఆంక్షలను కాదని.. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేస్తోంది కిమ్​ సర్కారు. ఇటీవల రెండు దీర్ఘ-శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను(ఐసీబీఎం) ఉత్తర కొరియా ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. భవిష్యత్​లో మరిన్ని ప్రమాదకరమైన క్షిపణి ప్రయోగాలను కిమ్​ సర్కారు చేపట్టే అవకాశముందని హెచ్చరించింది.

తాజాగా ఉత్తరకొరియా జరిపిన బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగం.. 2017లో జరిపిన ఐసీబీఎం(అమెరికాను చేరుకోగల సామర్థ్యం) క్షిపణి పరీక్షల కంటే పెద్దదని.. అంచనా వేసింది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. అలాగే పసిఫిక్‌లోని అమెరికన్ క్షిపణి విధ్వంసక, నిఘా దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఆ కెమెరాను పరీక్షించాం!

అయితే ఫిబ్రవరి 26, మార్చి 4 తేదీల్లో జరిపిన క్షిపణి ప్రయోగాలపై క్లారిటీ ఇచ్చింది ఉత్తరకొరియా. భవిష్యత్తులో నిఘా ఉపగ్రహంలో అమర్చే కెమెరాలను పరీక్షించడానికే ఆ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది.

గత కొన్ని నెలలుగా వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తర​కొరియా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తొమ్మిది ప్రయోగాలను చేపట్టింది. అణ్వాయుధాల కట్టిడిపై 2019లో అమెరికాతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఉత్తరకొరియా మరింత జోరు పెంచింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా ఈ ప్రయోగాలు చేపడుతోంది.

ఇదీ చూడండి: బాటిల్ నీళ్లతో.. భారీ బాంబుని నిర్వీర్యం చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.