ETV Bharat / international

వ్యోమగాములకు టాయిలెట్లు బంద్​... డైపర్లే దిక్కు! - స్పేస్​ఎక్స్​ వార్తలు

అంతరిక్ష కేంద్రంలోని స్పేస్​ఎక్స్​ వ్యోమగాములకు వింత సమస్య ఎదురైంది. వారు భూమి మీదకు తిరిగి వచ్చేందుకు ఉపయోగించనున్న క్యాప్సుల్​లో టాయిలెట్​ లేదు. అయితే, ఇది పెద్ద సమస్య కాదని వ్యోమగాములు చెబుతున్నారు.

space x
స్పేస్​ఎక్స్​ వ్యోమగాములకు టాయిలెట్లు బంద్​!
author img

By

Published : Nov 6, 2021, 9:49 PM IST

అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన స్పేస్​ఎక్స్​ వ్యోమగాములకు వింత సమస్య ఎదురైంది. వారు తిరుగు ప్రయాణం చేసే క్యాప్సుల్​లో టాయిలెట్ అందుబాటులో లేదు. కేవలం డైపర్లు ధరించి ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్సుల్​లో ఉన్న టాయిలెట్​ పాడవడమే అందుకు కారణం.

క్యాప్సుల్​లో టాయిలెట్​ లేకపోవడం తమకు పెద్ద సమస్య కాదని నాసా వ్యోమగామి మేగన్​ మెక్​ ఆర్థర్​ తెలిపారు. తమకు వచ్చిన ఇతర సమస్యల్లానే దీనిని కూడా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

ఈ వారాంతంలో వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరాల్సి ఉంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న మెక్​ ఆర్థర్​ సహా మరో ముగ్గురు వ్యోమగాములు తిరిగి భూమి మీదకు రానున్నారు. ఇప్పటికే వీరి ప్రయాణం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. టాయిలెట్ సమస్య నేపథ్యంలో.. వీరి ప్రయాణం మరోసారి వాయిదా పడుతుందేమోనని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదీ చూడండి : చైనా దూకుడు- 3 రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లు ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.