ETV Bharat / international

'భారత్​తో సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి.. ఆ ప్రభావం ఉండదు' - AMERICA COMMENTS ON INDIA RELATION

INDIA AMERICA RELATION:భారత్​తో తమకున్న సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్​ప్రైస్​ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్​ ఉద్రిక్తతల ప్రభావం ఏం లేదని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం చూపే దిశగా పలు దేశాలతో చర్చిస్తున్నామని అన్నారు.

US-INDIA-RUSSIA-UKRAINE
భారత్​ అమెరికా
author img

By

Published : Feb 4, 2022, 12:18 PM IST

INDIA AMERICA RELATION: రష్యా-ఉక్రెయిన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​తో తమ సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అమెరికా స్పష్టం చేసింది. భారత్​తో తమకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని, అవి ఆ దేశ యోగ్యతపై ఆధారపడి ఉంటాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్​ప్రైస్​ వ్యాఖ్యానించారు.

ఆ రెండు దేశాల ఉద్రిక్తతల ప్రభావం.. పొరుగు దేశాల భద్రతా వాతావరణంపై ప్రభావం చూపుతుందని గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.

ఐక్యరాజసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​పై భారత వైఖరికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించకుండా దాట వేశారు. ఈ విషయంపై చర్చించడానికి భారత సహచరులకే వదిలేస్తున్నానని ప్రైస్​ అన్నారు. రష్యా-ఉక్రెయిన్​ల మధ్య​ ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి దిశగా భారత్​తో సహా మరికొన్ని దేశాలతో వివిధ దశల్లో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రైస్​తెలిపారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్​పై దాడికి రష్యా కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.