ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీపై న్యూయార్క్ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మన్‌హాటన్‌లోని ఎల్ఎల్డీ డైమండ్స్‌ను నేహల్ 2.6 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు అభియోగపత్రం దాఖలైంది.
2015 ఏప్రిల్- ఆగస్టు మధ్యకాలంలో తమ సంస్థ నుంచి 2.6మిలియన్ డాలర్లు విలువ చేసే వజ్రాలను వ్యాపారం పేరుతో నమ్మించి తీసుకుని మోసం చేశారని నేహల్‌పై ఆరోపణలు చేసింది ఎల్ఎల్డీ. కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్‌తో సంబంధాలున్నట్లు చెప్పి తమ సంస్థ నుంచి క్రెడిట్ బేస్ మీద వజ్రాలు తీసుకున్నారని, ఆ తర్వాత వాటిని వేరే దగ్గర తాకట్టు పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రుణం తీసుకున్నారని కోర్టుకు తెలిపింది.
నేహల్ సోదరుడు నీరవ్ మోదీ పంజాబ్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి దేశం వీడి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లోని జైలులో ఉన్నారు.