ETV Bharat / international

పెన్సిల్​ లెడ్​తో కరోనా పరీక్షలు- మరింత చౌకగా! - పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం

చౌక ధరలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసే విధానాన్ని కనుగొన్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. దానికోసం పెన్సిల్ లెడ్​లో వాడే గ్రాఫైట్​తో తయారు చేసిన ఎలక్ట్రోడ్​లను ఉపయోగించనున్నట్లు తెలిపారు.

COVID-19 test
కరోనా
author img

By

Published : Aug 17, 2021, 5:23 AM IST

తక్కువ ధరలో వేగంగా, కచ్చితత్వంతో చేసే కరోనా నిర్ధరణ పరీక్షను అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ బృందం అభివృద్ధి చేసింది. వైరస్‌ నిర్ధరణ కోసం పెన్సిల్​ లెడ్​లో వాడే గ్రాఫైట్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్‌లను ఉపయోగించనున్నారు. ఆరున్నర నిమిషాల్లో ఒకటిన్నర డాలర్లతోనే పరీక్ష చేయవచ్చని అమెరికాకు చెందిన.. ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పత్రిక తెలిపింది.

ఈ విధానంలో నోటి నుంచి చేసే పరీక్ష వందశాతం, ముక్కు నుంచి చేసే పరీక్ష 88 శాతం విజయవంతమైనట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ బృందం గతంలోనే కరోనా నిర్ధరణ పరీక్షను అభివృద్ధి చేయగా.. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో దాన్ని తయారుచేసింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని, దీనికోసం మరిన్ని క్లినికల్ అధ్యయనాలు చేయాలని వారు తెలిపారు.

ఇదీ చూడండి: వుహాన్​లో కోటి మందికి కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.