ETV Bharat / international

'చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు' - నాటో దేశాలు

చైనా ముప్పుపై నాటో దేశాధినేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైనికపరంగా చైనాతో ప్రపంచ భద్రతకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా అణుక్షిపణుల తయారీలో ఆ దేశం కనబరుస్తున్న వేగంపై నాటో కూటమి చర్చించింది. చైనా బాధ్యతగా వ్యవహరించాలని, అంతర్జాతీయ నియమాలను గౌరవించాలని తీర్మానంలో పేర్కొంది.

NATO leaders
నాటో కూటమి
author img

By

Published : Jun 15, 2021, 12:51 PM IST

ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో సోవియట్‌ యూనియన్‌ను నిలువరించేందుకు ఏర్పడిన నాటో కూటమి.. తర్వాత ఆ యుద్ధ ఛాయలు ముగిసినా ఆ దేశాన్నే ప్రథమ శత్రువుగా భావించాయి. నిన్న మొన్నటివరకు రష్యానే ప్రత్యర్థిగా చూశాయి. అయితే తొలిసారి నాటో వైఖరిలో మార్పు వచ్చింది. బ్రసెల్స్‌లో సోమవారం నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహ 30 దేశాధినేతల సమావేశం.. చైనా ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

ప్రపంచానికే ముప్పు..

సైనికపరంగా చైనాతో ప్రపంచ భద్రతకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ముఖ్యంగా అణుక్షిపణుల తయారీలో ఆ దేశం కనబరుస్తున్న వేగంపై నాటో కూటమి చర్చించింది. చైనా బాధ్యతగా వ్యవహరించాలని, అంతర్జాతీయ నియమాలను గౌరవించాలని తీర్మానంలో పేర్కొంది. నాటో తీర్మానంలో చైనా పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బైడెన్‌ కూడా చైనా రష్యాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు.

ఆ దేశాలు తాము ఆశించిన రీతిలో ప్రవర్తించడం లేదని అన్నారు. అంతకుముందు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ విలేకరులతో మాట్లాడుతూ చైనాతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి నాటో కూటమి సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. బాల్టిక్స్‌ నుంచి ఆఫ్రికా వరకు ఎక్కడ చూసినా చైనాయే కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

"చైనా మనకు సమీపంగా వస్తోంది. సైబర్‌ రంగంలో ఉంది. ఆఫ్రికాలోనూ ఆ దేశం కనిపిస్తోంది. మనకు చెందిన చాలా కీలకమైన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అదే సమయంలో చైనా మాకు శత్రువు కాదు. చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం చేయాలనుకోవడం లేదు. ఆ దేశం ప్రత్యర్థీ కాదు, శుత్రువూ కాదు. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత రష్యాతో ఇంతలా సంబంధాలు దిగజారడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ చట్టాలను ఆ దేశం గౌరవించాలని, సైబర్‌ దాడులు మానుకోవాలి."

-- జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌, నాటో సెక్రటరీ జనరల్‌

ఐరోపాకు అండగా ఉంటాం: బైడెన్‌

నాటో సమావేశానికి హాజరైన బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. తాము ఐరోపాకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ట్రంప్‌ హయాంలో ఐరోపాతో.. అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్‌.. నాటో కూటమికి అమెరికా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. "ఒప్పందంలోని 5వ అధికరణం ప్రకారం కూటమిలోని ఒక దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై జరిగినట్టు భావించవలసి ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన విధి. దీన్ని అమెరికా అమలు చేస్తుంది" అని అన్నారు.

అంతరిక్షంలో దాడి చేసినా ఊరుకోం

నాటో ఒప్పందంలోని ఐదో అధికరణం ప్రకారం.. కూటమిలోని ఒక దేశంపై సాయుధ దాడి జరిగినా, అది సభ్యదేశాలందరిపై దాడిగా పరిగణించాలి. ఆరంభంలో భూ, జల, వాయు మార్గాలనే ప్రస్తావించారు. తర్వాత సైబర్‌ దాడులను, తాజాగా అంతరిక్ష దాడులనూ ఈ అధికరణ పరిధిలోకి తెచ్చారు. సభ్యదేశానికి చెందిన ఉపగ్రహాలు లేదా అంతరిక్ష కేంద్రాలపై దాడులు జరిగినా.. కూటమిలోని మిగతా దేశాలు అండగా నిలుస్తాయి.

ఇదీ చదవండి : బైడెన్​కు చైనా స్ట్రాంగ్​ వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.