ETV Bharat / international

నాసా రికార్డ్​: అరుణ గ్రహంపై ఎగిరిన హెలికాప్టర్​

భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్​గా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ రికార్డు సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రయోగంలో.. అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీని విజయవంతంగా నడిపినట్లు నాసా వెల్లడించింది.

NASA
అరుణ గ్రహంపై ఎగిరిన హెలికాప్టర్​
author img

By

Published : Apr 19, 2021, 5:20 PM IST

Updated : Apr 19, 2021, 5:38 PM IST

భూమ్మీద కాకుండా మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ చరిత్ర సృష్టించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రయోగంలో.. నాసా తన మినీయేచర్ హెలికాఫ్టర్ ఇన్‌జెన్యూటీని అరుణ గ్రహంపై విజయవంతంగా నడిపింది. అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీ ఎగిరినట్లు నాసా వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు ప్రయాణించి.. అనంతరం విజయవంతంగా తిరిగి ల్యాండైంది.

చరిత్రను తిరగరాసింది..

అరుణ గ్రహంపై వారం కిందటే ఈ హెలికాప్టర్ ఎగరాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యలతో ఈ రోజుకు వాయిదా పడింది. ఇప్పటివరకు భూమిపై తప్ప మరే గ్రహంపైనా, ఉపగ్రహంపైనా హెలికాప్టర్ ఎగరలేదు. ఇన్‌జెన్యూటీ.. ఈ చరిత్రను తిరగరాసింది. ఈ నేపథ్యంలో బుధ గ్రహంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగిరేందుకు ఎలాంటి వాతావరణం ఉంటుంది? అనే అంశంపై నాసా స్పష్టమైన అవగాహనకు రానుంది.

క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య..

మరోవైపు.. భూమితో పోలిస్తే బుధ గ్రహంపై గాలిలో బలం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి మీద హెలికాఫ్టర్‌లోని బ్లేడ్లు సగటున నిమిషానికి 400 నుంచి 500 భ్రమణాలు చేస్తే.. అంగారక గ్రహం మీద ఇన్‌జెన్యూటీ హెలికాఫ్టర్‌లోని బ్లేడ్ల భ్రమణాల సంఖ్య నిమిషానికి రెండున్నర వేలుగా ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య ఇన్‌జెన్యూటీ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను పరిశీలించేందుకు పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌తో పాటే నాసా ఈ మినీయేచర్ హెలికాఫ్టర్‌ను మార్స్‌ మీదకు పంపింది. పర్సెవరాన్స్ రోవర్‌ కింది భాగంలా.. ఈ హెలికాప్టర్‌ను అతికించారు. ఇన్‌జెన్యూటీ ఫిబ్రవరి 18న రోవర్ నుంచి విడిపోయి మార్స్‌పై అడుగుపెట్టింది. ఇవాళ ఇన్‌జెన్యూటీ అంగారకుడిపై ఎగిరే దృశ్యాలను పెర్సెవరాన్స్ చిత్రీకరించి భూమికి పంపింది.

ఇదీ చూడండి: మార్స్​పై రోవర్‌ దిగిన అద్భుత దృశ్యాలు

ఇదీ చూడండి: మార్స్‌పై రోవర్‌ 'టెస్ట్‌ డ్రైవ్‌'.. అద్భుతం!

Last Updated : Apr 19, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.