ETV Bharat / international

కరోనా కేసులు తగ్గించేందుకు ట్రంప్‌ చెప్పిన ఉపాయం!

author img

By

Published : Jun 21, 2020, 3:10 PM IST

సంచలన నిర్ణయాలు, ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్​ రూటే సెపరెేటు. అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో వైరస్​ టెస్ట్​లను తగ్గించాలని అధికారులకు ఆదేశించారు ట్రంప్​. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

More testing means more cases slow it down says Trump
కరోనా కేసులు తగ్గించేందుకు ట్రంప్‌ చెప్పిన ఉపాయం!

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశం అమెరికా. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయడం తగ్గించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. శనివారం ఓక్లహోమాలోని టల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

'నిర్ధరణ పరీక్షలు అనేది కత్తికి రెండు వైపులా పదును లాంటిది. ఎక్కువ పరీక్షలు చేస్తేనే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయి. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పాను.'

- డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అయితే.. సభలో ఆయన మద్దతుదారులు కేరింతలు కొడుతుంటే సరదాగా వ్యాఖ్యానించారా లేక నిజంగానే అధికారులకు అలాంటి ఆదేశాలు జారీ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 22,95,615 మంది వైరస్​ బారినపడ్డారు. వీరిలో 1,21,441 మంది మరణించారు. వైరస్‌ ఉద్ధృతి ఎక్కవగా ఉన్నందున నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచాలని తొలినాళ్లలో వైద్యనిపుణులు ట్రంప్‌కు సూచించారు. ఫలితంగా కొన్నిరోజుల పాటు పరీక్షలు భారీ స్థాయిలో జరిగాయి. తాజాగా పరీక్షల్ని తగ్గించమన్నట్లు ట్రంప్‌ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. నవంబర్‌‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉద్ధృతిని తక్కువ చేసి చూపేందుకు యత్నిస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: అది కరోనా కాదు... చైనీస్​ 'కుంగ్​ ఫ్లూ': ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.