ETV Bharat / international

ట్రంప్​పై తీవ్ర స్థాయిలో స్పందించిన బైడెన్​ - Biden comment on coronavirus

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పాలకవర్గంపై కీలక వ్యాఖ్యలు చేశారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​. వ్యాక్సిన్‌ ప్రణాళికలు, జాతీయ భద్రత, విధానపరమైన సమస్యల్ని అధికార బదిలీ నిమిత్తం ఏర్పాటు చేసిన తన బృందంతో పంచుకోవాలని డిమాండ్‌ చేశారు​. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

More people will die if Biden fails to co-ordinate says Biden
ట్రంప్‌నకు బైడెన్​ హెచ్చరిక- 'సహకరించండి..లేదంటే..'
author img

By

Published : Nov 17, 2020, 11:17 AM IST

కరోనా వైరస్‌ విషయంలో తన బృందంతో అధ్యక్షుడు ట్రంప్‌ పాలకవర్గం సహకరించాలని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కోరారు. వ్యాక్సిన్‌ ప్రణాళికలు, జాతీయ భద్రత, విధానపరమైన సమస్యల్ని అధికార బదిలీ నిమిత్తం ఏర్పాటు చేసిన తన బృందంతో పంచుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధికార మార్పిడికి ట్రంప్‌ నిరాకరిస్తుండడంపై బైడెన్‌ ఈ స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి.

వ్యాక్సిన్‌ పంపిణీ చాలా కీలకమైన ప్రక్రియ అని బైడెన్‌ అన్నారు. దానికోసం తక్షణమే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను అధికార బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20వరకు వేచిచూస్తే మహమ్మారిని అరికట్టడానికి సమయం మించిపోతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తమతో సహకరించాలని అధ్యక్షుణ్ని కోరారు. ట్రంప్‌ నిరాకరిస్తే.. తాము తమ సొంత ప్రణాళికల్ని అమలు చేయాల్సి ఉంటుందని బైడెన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రోన్‌ క్లెయిన్‌ తెలిపారు.

అవసరమైతే తానూ వ్యాక్సిన్‌ తీసుకుంటానని బైడెన్‌ తెలిపారు. తద్వారా టీకా భద్రతపై నెలకొన్న భయాలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పరోక్షంగా మోడెర్నా, ఫైజర్‌ టీకాల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతులిచ్చే అవకాశం ఉందన్న ట్రంప్‌ వ్యాఖ్యలే టీకాపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించిందని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: అమెరికా చదువులకు కరోనా శాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.