ETV Bharat / international

'భారత్-అమెరికా బంధం బలోపేతానికి మోదీ పర్యటన కీలకం'

భారత్​ ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా పర్యటన(modi us visit 2021) ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి(US India relationship) ఎంతో కీలకమన్నారు ఇద్దరు భారతీయ అమెరికన్​ చట్టసభ్యులు . ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశం నుంచి మోదీ.. అమెరికా వస్తున్నారని భారతీయ అమెరికన్​, ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎంఆర్​ రంగస్వామి పేర్కొన్నారు.

మోదీ అమెరికా పర్యటన
modi us visit 2021
author img

By

Published : Sep 22, 2021, 10:47 AM IST

భారత్-అమెరికా బంధం బలోపేతానికి(US India relationship) ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన(Modi US trip 2021) ఎంతో కీలకమని ఇద్దరు భారతీయ అమెరికన్​ చట్టసభ్యులు పేర్కొన్నారు. "ప్రధాని మోదీ పర్యటనను తాను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్​ సభ్యుడు రోహిత్​ ఖన్నా తెలిపారు. ఇరు దేశాల​ బంధం బలోపేతానికి ఇది కీలకం అని తాను నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో తన నాయకత్వంలో భారత్​కు సాయం చేయడం గర్వంగా ఉందన్నారు ఖన్నా.

"ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం పెంపొందడం ద్వారా ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లగలం. మానవ హక్కుల సూత్రాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నా" అని ఖన్నా అన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో మోదీ భేటీ(modi us tour 2021).. ఇరు దేశాల​ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం(US India relationship) చేసేందుకు ఇది కీలక దశ అని మరో భారతీయ అమెరికన్​ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. పెట్టుబడి, వాణిజ్యం సహా వ్యాక్సిన్​ ఉత్పత్తి, పంపిణీని విస్తరించడం ద్వారా మహమ్మారిని అంతం చేయడం వంటి పలు అంశాలపై ఇరు దేశాలకు లబ్ధి చేకూరుతుందని నొక్కిచెప్పారు. అలాగే క్వాడ్​ సభ్యదేశాల సమావేశంలో ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బలమైన పునాది పడుతుందన్నారు.

బలమైన ఆర్థిక శక్తి

ప్రధాని మోదీ బలమైన ఆర్థిక వ్యవస్థ(powerful economy in the world) నుంచి అమెరికా వస్తున్నారని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఇండో అమెరికన్ ఎంఆర్​ రంగస్వామి పేర్కొన్నారు. "మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. కరోనాతో కుదేలైన భారత్​.. ప్రస్తుతం వృద్ధి బాట పట్టింది.. బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది" అని పేర్కొన్నారు.

పలు సంస్థలు.. భారత్​ను పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తున్నాయని.. భారీ సంఖ్యలో భారతీయ స్టార్టప్‌లు యునికార్న్‌లుగా మారుతున్నాయని రంగస్వామి అన్నారు. ​ఇది భారత్​కు 'స్వర్ణ దశాబ్దం'గా అభివర్ణించారు.

ఇదీ చూడండి: Modi US visit 2021: అత్యున్నత భేటీలు.. కీలక చర్చలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.