ETV Bharat / international

'మోడెర్నా ప్రయోగాత్మక వ్యాక్సిన్​ వచ్చేస్తోంది'

కొవిడ్​పై పోరాటంలో భాగంగా అభివృద్ధి చేస్తోన్న మోడెర్నా ప్రయోగాత్మక టీకా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే మూడోదశ ట్రయల్స్​ ప్రారంభించుకున్న ఈ వ్యాక్సిన్​.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Moderna prepares global launch of Covid-19 vaccine
ప్రపంచ వ్యాప్త విడుదలకు మోడెర్నావ్యాక్సిన్ సిద్ధం​
author img

By

Published : Oct 30, 2020, 6:14 PM IST

కరోనాను అరికట్టేందుకు అమెరికన్​​ బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా అభివృద్ధి చేస్తోన్న టీకా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం మూడోదశలో ఉన్న mRNA-1273 ప్రయోగాల్లో.. తాము చురుగ్గా పాల్గొంటున్నట్టు మోడెర్నా సీఈఓ స్టెఫానీ బన్సెల్​ తెలిపారు. వ్యాక్సిన్​ సరఫరాకు సంబంధించి ఆయా ప్రభుత్వాలతో.. ఇప్పటికే తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాక్సిన్​కు సంబంధించి ఇప్పటికే మూడో దశ నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు బన్సెల్​. రెండోదశ అధ్యయన ఫలితాలపై దృష్టి సారించినట్టు చెప్పారు​​. ఈ టీకా అధిక నాణ్యత, ప్రమాణాలతో శాస్త్రీయ పరిశోధనలకు కట్టుబడి తయారుచేస్తున్నట్లు స్పష్టం చేశారు.

జులైలో ప్రయోగాలు మొదలుపెట్టిన మోడెర్నా.. అక్టోబర్ 22న mRNA-1273కు సంబంధించి మూడోదశ ట్రయల్స్​ ప్రారంభించింది. సుమారు 30వేల మంది వ్యాక్సిన్​ ట్రయల్స్​లో భాగమయ్యారు.

ఇదీ చదవండి- 'వ్యాక్సిన్ల ఉత్పత్తికి విదేశీ సంస్థలతో పొత్తుకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.