కరోనా మహమ్మారి దశల వారీగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఏడాదికోసారి కొవిడ్ టీకా తీసుకునే పరిస్థితులు తలెత్తవచ్చని ప్రముఖ ఔషధ సంస్థ మోడెర్నా సహ వ్యవస్థాపకుడు నౌబర్ అఫెయాన్ అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడిన ఆయన సాధారణ ఫ్లూ టీకాల మాదిరిగానే కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చని అంచనా వేశారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ టీకా తీసుకోవాలని ప్రజారోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారని నౌబర్ గుర్తు చేశారు.
ఇదీ చదవండి: పామాయిల్ రైతులకు గుడ్న్యూస్- భారీగా పెట్టుబడి సాయం