ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్ బ్లూమ్‌బర్గ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారత్-అమెరికా సంబంధాలకు మద్దతుదారుగా ఉన్న ఆయన డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.
"ట్రంప్‌ను ఓడించేందుకు నేను అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నా. అమెరికా పునర్నిర్మాణమే నా లక్ష్యం. ట్రంప్ పాలనను మరో నాలుగేళ్లు భరించే అవసరం అమెరికన్లకు లేదు. అమెరికాకు, మన విలువలకు ట్రంప్ అత్యంత ప్రమాదకారిగా ఉన్నారు. ఆయన మరోసారి గెలిస్తే ఆ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం. ఈ ఎన్నికల్లో మనం తప్పకుండా గెలవాలి. "
- మైఖేల్ బ్లూమ్‌బర్గ్, ప్రముఖ వ్యాపారవేత్త
డెమొక్రాట్లకు ఫిబ్రవరి 3న అయోవా వేదికగా జరిగే ప్రాథమిక పోరులో బ్లూమ్‌బర్గ్ పాల్గొనే అవకాశం ఉంది.
ఢీ అంటే ఢీ...
ట్రంప్, బ్లూమ్‌బర్గ్ ఇద్దరూ దిగ్గజ వ్యాపారవేత్తలు. బ్లూమ్‌బర్గ్ గతంలో న్యూయార్క్ మేయర్‌గా పనిచేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం 10 బిలియన్ డాలర్ల వరకు విరాళాలు అందించారు. ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థలు 129 దేశాల్లోని 510 నగరాల్లో సేవలందిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడైన బ్లూమ్‌బర్గ్.. వాతావరణ మార్పులపై పోరాటంలో క్రియాశీలకంగా పనిచేశారు. గత ఐదేళ్లలో భారత్‌కు అనేకసార్లు వచ్చారు.
ఇదీ చూడండి: అధ్యక్షుడికి అగ్నిపరీక్ష... అభిశంసన ఫలితం ఎలా?