ప్రస్తుతం పోపోకాటేపెట్ల్ అనే అగ్నిపర్వతం నిప్పులు చెరుగుతోంది. పరిసర ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చేసేది లేక ఇజ్టెక్సిహుత్ అగ్నిపర్వతాన్ని వేడుకునేందుకు కొండపైకి వందల మంది ప్రజలు చేరుకున్నారు.
" మాకు అన్నీ ఇచ్చినందుకు ఇజ్టెక్సిహుత్ పర్వత మాతకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. మా పంటల కోసం వర్షాలు కురిపించాలని ఆమెను అడుగుతున్నాం. ఇక్కడ జీవించేందుకు వీలు కల్పించినందుకు, సంతోషంగా ఉండేందుకు చోటు ఇచ్చినందుకు అగ్నిపర్వతాలకు మేము కృతజ్ఞులం. "
- నసారియో, శాంటియాగో షాలిట్జింట్లా వాసి.
ఈ వేడుకలు ఏటా మే ప్రారంభంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. తమ వెంట తీసుకొచ్చిన పుష్పాలు, వివిధ రకాల వంటకాలను సమర్పించిన అనంతరం ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతారు.
ఇదీ చూడండి: ఒడిశాలో 'ఫొని' మృతుల సంఖ్య 34కి చేరిక