ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి..  74 లక్షలకు చేరువైన కేసులు - corona news update

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా 24 గంటల్లో 73 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. రష్యాలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరువైంది.

Mexico sees cases numbers swell, reports 596 new deaths
ప్రపంచ వ్యాప్తంగా 74 లక్షలకు చేరువైన కరోనా కేసులు
author img

By

Published : Jun 10, 2020, 11:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాటికి 73 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4లక్షల 15 వేలకు చేరువైంది.

Mexico sees cases numbers swell, reports 596 new deaths
కరోనా కేసులు వివరాలు

అమెరికాలో 3వేలకు పైగా కేసులు

అమెరికాలో తాజాగా 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల 50 వేలకు చేరువైంది. మరో 125 మంది మృతి చెందారు. ఇప్పటివరకు లక్షా 14 వేల 273 మంది మృత్యువాతపడ్డారు.

రష్యాలో 8 వేల కేసులు

రష్యాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,404 మందికి వైరస్ సోకింది. ఫలితంగా వైరస్​ బాధితుల సంఖ్య 4,93,657కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 6,358 మంది మహమ్మారికి బలయ్యారు.

అత్యధిక కేసులు

పాకిస్థాన్​లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 5,385 మందికి వైరస్​ సోకింది. అక్కడ ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరో 83 మంది మృత్యవాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 13 వేలు దాటింది. వీరిలో 75,139 మంది చికిత్స పొందుతుండగా... మరో 36,308 మంది కోలుకున్నారు.

నేపాల్​లో 279 కేసులు..

నేపాల్​లోనూ వైరస్​ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 279 మంది కరోనా బాధితులుగా మారారు. వీరిలో 257 మంది పురుషులు కాగా, 22 మంది మహిళలు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,614 కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 15కు చేరింది.

మలేషియాలో...

దాదాపు మూడు నెలల లాక్​డౌన్​ తర్వాత తిరిగి ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది మలేషియా ప్రభుత్వం. పాఠశాలలు, సెలూన్​ షాపులు, వీధి మార్కెట్లు తెరుచుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8,336 మందికి వైరస్ సోకగా 117 మంది మృతి చెందారు.

మెక్సికోలో 4,199 కేసులు

మెక్సికోలో తాజాగా రికార్డు స్థాయిలో 4,199 కేసులు నమోదైనట్లు ఆ దేశ అధికార యంత్రాంగం ప్రకటించింది. మరో 596 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 14,649కి చేరింది. దేశ వ్యాప్తంగా 1,24,301 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 90 వేల మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

దక్షిణ కొరియాలో 50 కేసులు

దక్షిణ కొరియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 50 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. రాజధాని సియోల్​లో 41 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 11,902కు చేరింది. డోర్​ టూ డోర్​ డెలివరీ చేస్తున్న వారి నుంచి ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.