ప్రపంచవ్యాప్తంగా కరనా మహమ్మారి మాహావిలయం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో వైరస్ రెండోవేవ్ ప్రారంభమవటం వల్ల కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మెక్సికోలో కరోనా మరణాలు లక్ష దాటాయి. అమెరికా, భారత్, బ్రెజిల్‌ల తర్వాత ఈ మార్క్ అందుకున్న నాలుగో దేశంగా నిలిచింది మెక్సికో.
మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 100,104కు చేరినట్లు ప్రకటించారు ఆ దేశ అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ జోస్ లూయిస్ అలోమియా జెగర్రా. మొత్తం కేసుల సంఖ్య 10.19 లక్షలు దాటినట్లు చెప్పారు. అయితే.. 7.66 లక్షల మంది వైరస్ నుంచి కోలుకోవటం కాస్త ఊరట కలిగిస్తోంది. వైరస్ విజృంభణపై మెక్సికో ప్రజల్లో భిన్నప్రవర్తనలు ఉన్నాయి. సగం మంది వైరస్‌ను లెక్కచేయకుండా, మాస్క్‌లు ధరించకుండా తిరుగుతుంటే.. మరోవైపు వైరస్ భయంతో కొందరు ఒత్తిడికి లోనవుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసులు వివరాలు..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 12,070,712 | 258,333 |
బ్రెజిల్ | 5,983,089 | 168,141 |
ఫ్రాన్స్ | 2,086,288 | 47,127 |
రష్యా | 2,015,608 | 34,850 |
స్పెయిన్ | 1,574,063 | 42,291 |
యూకే | 1,453,256 | 53,775 |