Celebrities Who Changed Gender : ఇటీవలే టీమ్ఇండియా మాజీ క్రికెటర్, బౌలింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమెన్‌గా మారాడు. హార్మోన్ రీప్లేస్మెంట్ అనే ఓ సర్జరీ ద్వారా అతడు అమ్మాయిగా మారాడు. అంతేకాకుండా తన పేరును అనయగా మార్చుకున్నాడు. దీంతో యావత్ నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఇంతకుముందు లింగమార్పిడి చేయించుకుని జెండర్ మార్చుకున్నారు. ఇంతకీ వారు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాయేషా శిందే
బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ శిందే 2021లో లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమెన్గాగా మారాడు. ఈ క్రమంలో తన పేరును సాయేషా శిందేగా మార్చుకున్నాడు.
బాబీ డార్లింగ్
'తాల్', 'మైనే దిల్ తుజ్కో దియా', 'క్యా కూల్ హై హమ్' వంటి చిత్రాల్లో మెరిశారు బాబీ డార్లింగ్. 2010లో లింగమార్పిడి చేసుకుని ట్రాన్స్ ఉమెన్‌గా మారారు బాబీ డార్లింగ్. అంతవరకు పంకజ్ శర్మగా ఉన్న తన పేరును ఆ తర్వాత బాబీ సింగ్‌గా మార్చుకున్నారు. అయితే అప్పట్లో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
గౌరీ అరోరా
స్ప్లిట్స్ విల్లా వంటి పలు ప్రముఖ టీవీ షోల్లో కంటెస్టెంట్‌గా మెరిసిన గౌరీ అరోరా 2016లో లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమెన్‌గా మారారు. ఆ సమయంలో గౌరవ్ ఆరోరాగా ఉన్న తన పేరును గౌరీ అరోరాగా మార్చుకున్నారు.
నిక్కీ చావ్లా
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ మోడల్ నిక్కీ చావ్లా. ఆమె 2009లోనే తాను ట్రాన్స్ ఉమెన్నని తెలిపారు. ఆమె అనేక అంతర్జాతీయ ర్యాంప్ షోలు, రియాల్టీ షోలలో భాగమయ్యారు.
గజల్ ధాలివాల్
కథా రచయిత, నటి గజల్ ధలీవాల్ 20 ఏళ్ల వయసులో ట్రాన్స్ ఉమెన్‌గా తన జెండర్‌ను మార్చుకున్నారు. అలాగే ఆమె LGBTQ కమ్యూనిటీ కార్యకర్త కూడా. ఆమిర్ ఖాన్ టాక్‌షో 'సత్యమేవ జయతే'లో కూడా గజల్ పాల్గొన్నారు.
అంజలి అమీర్
ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మొదటి ట్రాన్స్‌జెండర్ అంజలి అమీర్. జంషీర్గా ఉన్న ఆమె పేరును లింగమార్పిడి తర్వాత అంజలిగా మార్చుకున్నారు. 1995లో కేరళలోని కోజికోడ్‌లో జన్మించారు. 'పెరన్బు'(2018), 'ది స్పాయిల్స్'(2024), 'సుజల్ -ది వోర్టెక్స్'(2022) వంటి చిత్రాల్లో నటించారు.
'నేను అతడు కాదు, ఆమె'- జెండర్ మార్చుకున్న మాజీ క్రికెటర్ కుమారుడు!
ఇమానె ఖెలిఫ్ కాంట్రవర్సీ- మెడికల్ రిపోర్ట్ లీక్ చేసిన వారిపై యాక్షన్‌కు రెడీ