మెక్సికోలో కనిపించకుండాపోయిన వారంతా శవాలుగా మారుతున్నారు. ఇప్పటివరకు 18 సంచుల నిండా మానవ అవయవాలు లభ్యమైనట్లు జాలిస్కో రాష్ట్ర పోలీసు అధికారి వెల్లడించారు. ఈ సంచుల్లో ఉన్నవి ఎంతమందికి సంబంధించిన అవయవాలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
ఇలా వెలుగులోకి వచ్చింది...
కొందరు దుండగులు ముగ్గురు వ్యక్తుల్ని వ్యవసాయ క్షేత్రంలో బంధించారు. వారిలో ఒకరు తప్పించుకుని వచ్చి పోలీసులను కలిశాడు. అసలు విషయం చెప్పాడు.
ఘటనా స్థలంపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు బందీలను విడిపించారు. ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. మనుషుల శరీర భాగాల్ని అక్కడ 18 సంచుల్లో నింపి ఉంచడాన్ని గుర్తించారు. మనుషులను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన రంపాలు సహా వివిధ రకాల మారణాయుధాలు, రక్తపు మరకలతో కూడిన డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు.
జాలిస్కోలోని ఇతర వ్యవసాయ క్షేత్రాల్లోనూ పోలీసులు సోదాలు చేశారు. రెండు చోట్ల 34 మంది అవయవాలు గుర్తించారు.
ఇదీ చూడండి: గ్రీన్‌కార్డు కాదు... ఇకపై 'బిల్డ్ అమెరికా' వీసా