ETV Bharat / international

మెక్సికోలో గ్యాంగ్​వార్స్.. 9మంది మృతి

author img

By

Published : Jan 8, 2021, 9:54 PM IST

మెక్సికోలో జరిగిన రెండు వర్గాల మధ్య గొడవల్లో కనీసం 9 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. సాయుధులైన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

MEXICO-GUNMEN
మెక్సికోలో గ్యాంగ్​వార్స్.. 9మంది మృతి

మెక్సికోలోని సిలయా ప్రాంతంలోకి గురువారం అర్ధరాత్రి జరిగిన గ్యాంగు ఘర్షణల్లో 9మంది మరణించారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారనేది తెలియదని పోలీసులు వెల్లడించారు.

భీతావహ దృశ్యం..

రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఈ మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క ముఠా ఈ ఘర్షణలకు బాధ్యత వహించకపోవటం గమనార్హం. సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను, భీతావహ దృశ్యాలను స్థానిక మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది.

ఘర్షణలు నిత్యకృత్యం..

ఈ దాడుల వెనుక పైపులైన్ల నుంచి ఇంధనాన్ని దొంగిలించే శాంటా రోసా ముఠా ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా రైళ్లు, పైప్‌లైన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినందున.. ముఠా దోపిడీ, కిడ్నాప్‌ల వైపు మళ్లిందని.. ఈ ఘటన వెనుక వీరి పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మెక్సికోలో నేరప్రవృత్తి, హింస, గ్యాంగ్ గొడవలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.

ఇదీ చదవండి: ఇటలీలో అకస్మాత్తుగా ఏర్పడ్డ 66 అడుగుల గుంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.