ETV Bharat / international

విడాకులు తీసుకోనున్న ట్రంప్ దంపతులు! - Melania to seek divorce from Donald trump

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ త్వరలో విడిపోనున్నారట. ఈ విషయాన్ని ఓ బ్రిటీష్ మీడియా సంస్థ తెలిపింది. ట్రంప్ శ్వేతసౌధం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Melania to seek divorce from Donald trump
విడాకులు తీసుకోనున్న ట్రంప్ దంపతులు !
author img

By

Published : Nov 10, 2020, 5:49 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్​కు మరొక ఎదురుదెబ్బ తగలనుందా? అంటే అవునంటోంది ఓ బ్రిటీష్​ మీడియా సంస్థ. ట్రంప్​ అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోగానే.. తన భార్య మెలానియా ట్రంప్​ విడాకులు తీసుకోనుందట. ఇందుకోసమే ట్రంప్​ శ్వేతసౌధం నుంచి ఎప్పుడెప్పడు బయటకు వస్తారా? అని మెలానియా ఎదురుచూస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో విడిపోతే తన అధికార బలంతో ట్రంప్​ ఏమైనా చేయొచ్చని మెలానియా భావిస్తున్నారట.

ట్రంప్​-మెలానియా 2005లో వివాహం చేసుకున్నారు. డొనాల్డ్​ ట్రంప్​కు మెలానియా మూడో భార్య కాగా వీరికి బారన్​ ట్రంప్​ అనే కుమారుడు ఉన్నాడు.

మరోవైపు మెలానియా మాజీ సలహాదారు స్టెఫానీ వాల్కాఫ్ 'మెలానియా అండ్​ మీ' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో ట్రంప్​ దంపతులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. మెలానియా తన కుమారుడు బారన్​కు ఆస్తిలో వాటా ఇస్తేనే.. శ్వేతసౌధంలోకి అడుగుపెడతానని ట్రంప్​తో ఒప్పందం చేసుకున్నట్లు స్టెఫానీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.