ETV Bharat / international

90ఏళ్ల వయసున్న ఈ చేప గురించి తెలుసా..?

Oldest aquarium fish: దాదాపు 90 ఏళ్ల వయసున్న అక్వేరియం చేప అమెరికా శాన్​ ఫ్రాన్సిస్కో మ్యూజియంలో ఉంది. ప్రపంచంలో జీవిస్తున్న అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. బైబిల్​లోని ఓ వ్యక్తి పాత్ర స్ఫూర్తితో దీనికి మెతుసెలా అని పేరు పెట్టారు.

Meet Methuselah, likely oldest aquarium fish
90ఏళ్ల వయసున్న ఈ చేప గురించి తెలుసా..?
author img

By

Published : Jan 26, 2022, 8:08 PM IST

Oldest aquarium fish: అమెరికా శాన్​ ఫ్రాన్సిస్కో మ్యూజియంలో ఓ అరుదైన అక్వేరియం చేప జీవిస్తోంది. ఈ లంగ్​ఫిష్​ వయసు దాదాపు 90 ఏళ్లు. పొడవు 4 అడుగులు. బరువు 40 పౌండ్లు. 1938లో ఆస్ట్రేలియా నుంచి దీన్ని అమెరికాకు తీసుకొచ్చారు. అప్పటికే దాని వయసు 6 సంవత్సరాలు.

Methuselah
అక్వేరియంలో మెతుసెలా

ఈ చేపకు మెతుసెలా అని పేరు పెట్టారు. అందుకు ఓ ప్రత్యేక కారణమే ఉంది. బైబిల్​లో మెతుసెలా అనే వ్యక్తి 969 సంవత్సరాలు జీవించినట్లు ఉంది. అ పాత్ర స్ఫూర్తితోనే చేపకు ఈ పేరు పెట్టారు. అయితే బైబిల్​లో మెతుసెలాలా మరీ 9 శతాబ్దాలు జీవించకపోయినా... 9 దశాబ్దాలుగా జీవిస్తోంది ఈ చేప. ప్రపంచంలోని అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది(వయసులో) కావడం గమనార్హం.

Methuselah
మెతుసెలాతో సంరక్షకుడు

మెతుసెలాకు ముందు మరో ఆస్ట్రేలియన్​ లంగ్​ఫిష్​ చికాగాలోని షెడ్ అక్వేరియంలో జీవించి ఉండేది. అయితే అది 95ఏళ్ల వయసులో 2017లో చనిపోయింది.

Methuselah
మెతుసెలా బాగోగులు చూస్తూన్న సంరక్షకులు

మెతుసెలా ఆడ చేప అని దాని సంరక్షకులు భావిస్తున్నారు. రక్తాన్ని పరీక్షించకుండా దాని లింగాన్ని అంచనా వేయలేం. అయితే మెతుసెలా మొప్పలను పరీక్షకు పంపి అది ఆడా? లేక మగా? నిర్ధరించనున్నట్లు సంరక్షకులు తెలిపారు. దీని వల్ల చేప వయసెంతో కచ్ఛితమైన అంచనాకు కూడా రావచ్చన్నారు.

Methuselah
సంరక్షుని చేతిలోకి వచ్చిన మెతుసెలా

ఈ లంగ్​ఫిష్​ను అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. దీంతో ఇకపై వీటిని విదేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉండదు. అందుకే మెతుసెలా చనిపోయాక దాని స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు.

Methuselah
అక్వేరియంలో జీవిస్తున్న మెతుసెలా

అయితే మెతుసెలా బతికి ఉన్నంతవరకు దానికి ఇష్టమైన ఫిగ్​(అంజీర), బెల్లీ రబ్స్​నే ఆహారంగా అందిస్తామని సంరక్షకులు చెప్పారు. దానికి ఏ లోటూ రాకుండా చూసుకుంటామన్నారు.

Methuselah
మెతుసెలాను వీక్షిస్తున్న సందర్శకులు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Flying car: ఎగిరే కారు వచ్చేసింది.. రెండే నిమిషాల్లో ఆకాశంలోకి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.