భారత ఆతిథ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గుర్తుచేసుకున్నారు. భారత ప్రజల మన్నన పొందిన గొప్ప నేతగా మోదీని అభివర్ణించారు. 'నమస్తే ట్రంప్' కార్యక్రమం చూసిన తర్వాత తాను జనం కోసం అంతగా ఆరాటపడటం లేదన్నారు. అమెరికా దక్షిణ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో భారత పర్యటన విశేషాలు పంచుకున్నారు అమెరికా అధ్యక్షుడు.
"నేను భారత ప్రధానితో గడిపాను. మోదీ గొప్ప వ్యక్తి, ఆయన్ను అక్కడ ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారు. అది గొప్ప విషయం. సాధారణంగా ఎక్కువ జనం ముందు ప్రసంగించడానికి ఇష్టపడతాను. ఇక్కడ ఏ సభలోనైనా 40- 60వేల మంది హాజరవుతారు. అయితే భారత్ నుంచి వచ్చిన తర్వాత ప్రేక్షకుల కోసం అంతగా తపించడం లేదు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కుటుంబ సమేతంగా గత నెల 24, 25న భారత్‌లో పర్యటించారు ట్రంప్. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లోని మోటేరా క్రికెట్ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ప్రసంగించారు.
ఇదీ చూడండి: కరోనా: దక్షిణ కొరియాలో ఇలా.. ప్రపంచవ్యాప్తంగా అలా