ETV Bharat / international

స్వీయ నిర్బంధంలో ఉన్న అమెరికన్లు ఏం చేస్తున్నారో తెలుసా? - coronavirus in America

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో అక్కడ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపే ఉద్యోగులు ఇప్పుడు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు.

Love and dating in times of coronavirus
స్వీయ నిర్బంధంలో ఉన్న అమెరికన్లు ఏం చేస్తున్నారో తెలుసా?
author img

By

Published : Mar 20, 2020, 9:39 PM IST

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ప్రజలు బయటకు రాకుండా స్వీయ నిర్బంధలో ఉండాలని ఆదేశించింది. ఇది అమెరికా వాసుల సామాజిక జీవన విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

భార్యాభర్తలు..

స్వీయ నిర్బంధం భార్యాభర్తల మధ్య పలు సమస్యలకు దారితీస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే భార్యాభర్తల మధ్య వివాదాలుంటే.. అవి మరింత పెరిగే అవకాశం ఉందని ఓ మానిసిక వైద్య నిపుణుడు తెలిపారు. ఇంట్లో భార్యతో కాకుండా బయట వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపేవారు భాగస్వామితో గొడవపడటానికి అవకాశం ఉందన్నారు. ఒకవేళ సత్సంబంధాలు ఉంటే అవి​ ఇంకా మెరగవుతాయని చెప్పారు. తీరిక లేకుండా గడిపే వ్యక్తులకు ఇదో మంచి సువర్ణావకాశమని చెప్పారు.

"తరుచూ గొడవ పడే వారు ఒకే దగ్గర ఎక్కువ సమయం గడిపితే సమస్య మరింత జటిలం అవుతుంది. కరోనా ఆంక్షలతో చైనాలో గృహహింస రేటు పెరిగింది. స్వీయ నిర్బంధం ప్రతికూల పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది. సత్సంబంధాలు లేనివారికి ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశం కాదు."

-డాక్టర్ వెండి డికిన్సన్, మానసిక నిపుణురాలు

సరదాగా..

వైరస్​ భయంతో స్వీయ నిర్బంధంలో ఉన్నాడు అరోన్​ గోల్డ్​న్​బర్గ్ అనే వ్యక్తి . ఎదుటి వ్యక్తిని శృంగార కోణంలో చూడటం అతడికి అలవాటు. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉండటం వల్ల ఆ అలవాటును మానుకున్నాడు. హాస్యాస్పదమైన వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యామాల్లో పోస్ట్‌ చేస్తున్నాడు.

30ఏళ్ల ఎమిళీ జియోకా ఇటీవల పబ్​లో ఓ వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తితో రెండోసారి డేటింగ్​కు ప్రణాళికలు రచించుకున్నాడు. వైరస్​ తీవ్రత వల్ల ఈసారి డిన్నర్​కు బదులుగా వారు ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నారట.

వినోదం..

కరోనాతో కారణంగా అమెరికాలో క్రీడలు నిలిచిపోయాయి. థియేటర్లు మూసివేశారు. బయటకు రావడానికి అవకాశం లేదు. ఈ విపత్తు హాలీవుడ్​పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరోనా వైరస్ వల్ల ఇంట్లోనే ఉంటున్న అమెరికన్లు నెట్‌ఫ్లిక్స్​, అమెజాన్​, ఇతర స్ట్రీమింగ్ టీవీ ఛానెల్స్​, సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో స్ట్రీమింగ్​ సేవలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

స్వీయ నిర్బంధంలో ఉన్న అమెరికన్లు ఏం చేస్తున్నారో తెలుసా?

ఇదీ చూడండి: విదేశీయుల వీసాల గడువును పొడిగించిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.